ప్రధాని మోడీ ఫోట్ తో ఫేస్ బుక్ లో గేమ్స్: అరెస్టు
బెంగళూరు: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కించపరిచి ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో పెట్టిన యువకుడిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని బళ్లారి సమీపంలో ఉన్న గంగావతిలో నివాసం ఉంటున్న మహమ్మద్ మహబూబ్ (25) అనే యువకుడిని అరెస్టు చేశారు.
మహమ్మద్ మహబూబ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని గంగావతి పోలీసులు చెప్పారు. పోలీసు అధికారుల కధనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎంఐఎం (మజ్లిస్) నాయకుడు అక్బరుద్దిన్ ఒవైసీ కాళ్ల మీద భారత ప్రధాని నరేంద్ర మోడీ పడుతున్నట్లు ఓ ఫోటోను తయారు చేశారు.

తరువాత ఆ ఫోటోను మహమ్మద్ మహబూబ్ తన ఫేస్ బుక్ లో పెట్టాడు. ఈ విషయం గుర్తించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఫేస్ బుక్ లో ఫోటో పెట్టిన వ్యక్తి గంగావతిలో ఉన్నాడని గుర్తించారు.
కచ్చితమైన ఆధారాలు సేకరించి మహమ్మద్ మహబూబ్ ను అరెస్టు చేశారు. అతని మొబైల్ ను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ మహబూబ్ ఈ ఫోటోను మార్ఫింగ్ చేశాడా ? ఎవరైనా షేర్ చేస్తే ఇతను పెట్టుకున్నాడా అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మహమ్మద్ మహబూబ్ గంగావతిలోని ఓ బంగారు షాప్ లో పని చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications