దారుణం.. కన్న కూతురు అని కూడా చూడకుండా.. దుస్తులు చించి..

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో దారుణం జరిగింది. కన్న కూతురి పైనే ఓ తండ్రి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. బంధువులతోనూ దాడి చేయించాడు. ఆమె దుస్తులు చించి అమానుషంగా ప్రవర్తించాడు. భూ వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలూకా గోపాలపుర గ్రామానికి చెందిన భైరప్పకు అమృత అనే కుమార్తె ఉంది. ఆరేళ్ల క్రితం సునీల్ అనే యువకుడితో ఆమె వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరూ బెంగళూరులో ఉంటున్నారు. ఇదే క్రమంలో మార్చి నెలలో అమృత భర్త సునీల్‌తో కలిసి గోపాలపురలోని పుట్టింటికి వచ్చింది. ఇంతలోనే కరోనా లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడే ఉండిపోయారు.

man attacks his daughter and son in law over a land dispute

ఇటీవల భైరప్ప తన పొలంలో మట్టిని తవ్వించి వేరే వారికి విక్రయించాడు. అయితే ఈ విషయంలో అమృత తండ్రితో గొడవపడింది. స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. భైరప్ప వేరే మహిళలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తమ కుటుంబాన్ని హింసిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

కుమార్తె తీరుపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన భైరప్ప.. ఆమె పోలీస్ స్టేషన్ నుంచి రాగానే ఘర్షణకు దిగాడు. అన్నదమ్ములను,బంధువులను పిలిపించి ఆమృత,ఆమె భర్త సునీల్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో ఆమె దుస్తులు కూడా చించడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడిలో ఇద్దరూ గాయపడటంతో.. సమాచారం అందుకున్న పోలీసులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+