పరువు హత్య: ఇష్టం లేని పెళ్ళి చేసుకొందని కూతురిని చంపేశాడు

తమకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొందనే కోపంతో కన్న కుమార్తెనే సజీవ దహనం చేశాడు ఓ తండ్రి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

లక్నో: తమకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొందనే కోపంతో కన్న కుమార్తెనే సజీవ దహనం చేశాడు ఓ తండ్రి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మోరాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకొంది. గుల్పాషా మూడేళ్ళ క్రితం సజ్జాద్ అనే వ్యక్తిని తల్లిదండ్రులు ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకొంది.

దీంతో ఆమె తండ్రి మష్రూప్ రజాఖాన్ ఆగ్రహంతో ఊగిపోతూ సమయం ఎదురుచూశాడు. శుక్రవారం నాడు గుల్పాషా తన రెండేళ్ళ కుమారుడు మరదలుతో కలిసి ఇంట్లోనే ఉంది.

honour killing in uttarpradesh

ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుటుంబసభ్యులు బయటకు వెళ్లారు. దీన్ని గమనించిన రజాఖాన్ కుమార్తె ఇంటికి వెళ్ళాడు. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.అయితే ఇది గమనించిన గుల్పాషా మరదలు షబ్నూర్ అరిచేందుకు ప్రయత్నించింది.దీంతో ఆమెపై కూడ కిరోసిన్ పోసి నిప్పంటించాడు.

వారిద్దరూ కూడ ఘటన స్థలంలోనే సజీవ సమాధి అయ్యారు. అయితే రెండేళ్ళ బాబు మాత్రం తృటిలో తప్పించుకొన్నాడు. ఇది పరువు హత్యేనని ఎస్పీ ఆశిష్ శ్రీవాస్తవ చెప్పారు. సజ్జాద్ తో పాటు మరో 11 మందిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. పోలీసులు కేసులు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+