కొడుకు పుట్టులేదని భార్యను, ముగ్గురు కూతుళ్ల సజీవ దహనం
కోల్ కత: కొడుకుకు జన్మనివ్వలేదని భార్యను, ముగ్గురు ఆడపిల్లలను సజీవదహనం చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలోని కాండి గ్రామంలో ఈ దారుణం జరిగింది.
కాండి గ్రామంలో ఉస్తాఖ్ ఆలీ, నజీఫా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 5,3,1 సంవత్సరాలు ఉన్న ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే మగబిడ్డకు జన్మనివ్వలేదని ఉస్తాఖ్ నిత్యం భార్య నజీఫాతో గొడవ పడేవాడు.

ఈ విషయంపై చుట్టు పక్కల వారు ఉస్తాఖ్ ఆలీని పలు సార్లు మందలించారు. అయితే అతను నిత్యం ఇంటికి వెళ్లిన సమయంలో భార్య నజీఫాతో ఇదే విషయంపై గొడవపడేవాడు. నజీఫా కుటుంబ సభ్యులు పలు సార్లు ఉస్తాఖ్ ఆలీకి వార్నింగ్ ఇచ్చారు.
అయినా అతని ప్రవర్థనలో మార్పురాలేదు. చివరికి భార్య, ముగ్గురు బిడ్డలను ఇంటిలో నిర్బందించి కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఉస్తాఖ్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications