హోటల్ గదిలో మరో వ్యక్తితో భార్య: భర్త ఏం చేశాడంటే..?

Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది. ఈ సంబంధాల కారణంగా పలు కుటుంబాలు కూలిపోతున్నాయి. హత్యలకు కూడా దారితీస్తున్నాయి.

తాజాగా, తన భార్య మరో వ్యక్తితో పడకగదిలో ఉండగా.. పోలీసులకు పట్టించాడు భర్త. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని నవరంగ్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

హోటల్ గదిలో..

హోటల్ గదిలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 2గంటల ప్రాంతంలో సదరు వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేశాడు. తన భార్య మిఠాఖలీ క్రాస్ రోడ్స్ ప్రాంతానికి సమీపంలోని ఓ హోటల్ గదిలో మరో వ్యక్తితో గడుపుతోందని, తనకు సాయం కోవాలని కోరాడు.

పట్టేశారు

పట్టేశారు

దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. చందేఖేడా ప్రాంతానికి చెందిన ప్రవీణ్(పేరుమార్చాం) అనే వ్యక్తితో పడకగదిలో బాధితుడి భార్య ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 మద్యం మత్తులో..

మద్యం మత్తులో..

హోటల్ గదిలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని, అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

 న్యాయం చేయండి

న్యాయం చేయండి

కాగా, బాధితుడి భార్యకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బాధితుడు పోలీసులను కోరారు. తనకు న్యాయం చేయాలని విన్నవించాడు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man called up city control room early on Sunday morning to inform that his wife was with another man. When police reached the spot, the accused was found in inebriated condition.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి