సీఎంగా నితీశ్: వేలుని బలిగా ఇచ్చిన వీరాభిమాని
పాట్నా: బీహార్ ఎన్నికల్లో జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గెలిచినందుకు ఓ వ్యక్తి తన వేలుని బలి ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే జెహానాబాద్ జిల్లా ఓయినా గ్రామానికి చెందిన అనిల్ శర్మ(53) ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు వీరాభిమాని.
నితీశ్ కుమార్ గెలిచినా ప్రతి సారీ ఏదో ఒక రకంగా విజయోత్సవాలను జరుపుకునేవాడు. కాకపోతే ఈసారి కాస్త వినూత్నంగా తన వేలుని బలిగా ఇచ్చాడు. ఈ నెల 20వ తేదీన పాట్నాలోని గాంధీ మైదాన్‌లో బీహార్ సీఎంగా నితీశ్ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

ప్రమాణ స్వీకార అనంతరం అదే రోజున ఇంట్లో ఉన్న కొడవలితో ఎడమ చేయి చిటికెన వేలిని గ్రామ దేవతకు బలి ఇచ్చినట్లు మీడియాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు. అనంతరం తన వేలిని తీసుకుపోయి గంగా నదిలో కలిపేశానని చెప్పారు.
ఈ చిటికెన వేలే కాదు, నితీష్ విజయానికి గుర్తుగా ఎడమ చేయికి సంబంధించిన మరో రెండు వేళ్లను 2005, 2010లో గ్రామదేవత ఎదుట బలిచ్చాడు. తనకున్న జెర్సీ ఆవులను అమ్మేసి మరీ నితీశ్ విజయాన్ని ఘనంగా సంబరాలు చేసున్నామని అతడు తెలిపాడు.












Click it and Unblock the Notifications