ఫ్యాషన్ డిజైనర్‌ను చంపి ముక్కలు చేసి పారేశాడు

ముంబైలోని చెంబూర్ జింఖానా రెస్టారెంట్ మేనేజర్ అయిన నిందితుడు ప్రభాకర్ షెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు అయిన ఫ్యాషన్ డిజైనర్ కాంతా షెట్టి (30) ఒత్తిడి తేవడంతో అతను ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్‌లో 36 ఏళ్ల ప్రభాకర్ షెట్టికి వేరే అమ్మాయితో పెళ్లి కుదిరింది. దీంతో కాంతా షెట్టి అతనిపై తీవ్రమైన ఒత్తిడి పెట్టింది.
ప్రభాకర్ షెట్టి కాంతా షెట్టిని అక్టోబర్ 29వ తేదీన గొంతు నులిమి చంపి స్నానాల గదిలో ముక్కలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తలను ప్లాస్టిక్ బ్యాగ్‌లో, కొన్ని అవయవాలను మరో రెండు సంచుల్లో కుక్కి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. కాంతా సోదరి సుహాసిని మిస్సింగ్ కింద ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభాకర్‌పై ఆమె అనుమానం వ్యక్తం చేసింది.
ప్రభాకర్ షెట్టితో తన సోదరి కాంతా షెట్టికి వైవాహికేతర సంబంధం ఏర్పడిందని, దీంతో కాంతా షెట్టి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, ఆమెకు 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడని సుహాసిని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ప్రభాకర్‌ను మంగళవారం అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications