తల్లిని, భార్యను చంపేశారు: ఆత్మహత్య చేసుకున్నారు
త్రిపుర: జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి తన తల్లిని హత్య చేసి తరువాత అతనూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన త్రిపుర సమీపంలోని అగర్తలలో జరిగింది. అగర్తలలో జయ్ దీప్ చక్రవర్తి (50) అనే వ్యక్తి తన తల్లి జ్యోత్స్నా చక్రవర్తి (70)తో కలిసి నివాసం ఉంటున్నాడు.
21 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో జ్యోత్స్నా చక్రవర్తి మతిస్థిమితం కొల్పోయారు. అప్పటి నుంచి ఆమె మంచి చెడ్డలు జయ్ దీప్ చక్రవర్తి చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తల్లి ఆరోగ్య పరిస్థితి చూసి జయ్ దీప్ చక్రవర్తి తట్టుకోలేకపోయాడు.
తల్లికి ఇక సేవలు చెయ్యలేక జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి నిద్రపోతున్న తల్లి జోత్స్నా చక్రవర్తి గొంతునులిమి హత్య చేశాడు. తరువాత అదే గదిలో జయ్ దీప్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్యను కాల్చి చంపేసిన బీఎస్ఎఫ్ జవాను!
త్రిపురలో భార్డర్ సెక్యూరిటి ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాను సురీందర్ మట్టి (27) నివాసం ఉంటున్నాడు. ఈయన భార్య ఖుషిదేబ్ నాథ్ (24). కొంత కాలంగా దంపతుల మద్య విభేదాలు వచ్చాయి. పెద్దలు సర్ధి చెప్పినా ఫలితం లేకపోయింది.
భార్య మీద కక్ష పెంచుకున్న సురీందర్ మట్టి ఆదివారం రాత్రి భార్యను తుపాకితో కాల్చి చంపి హత్య చేశాడు. తరువాత అతనూ అదే తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు కేసులు దర్యాప్తులో ఉన్నాయని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications