అక్రమ సంబంధం: భార్యను రెండు ముక్కలు చేసి
ముజఫర్ భంజ్: భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని సహించలేని భర్త ఆమెను రెండు ముక్కలుగా చేసిన ఘటన ఓడిశా రాష్ట్రంలోని మయూర్ భంజ్ జిల్లాలోని గిరీష్ చంద్రాపూర్ గ్రామంలో జరిగింది.
గిరీష్ చంద్రాపూర్ గ్రామంలో జీతు లోహార్ (43) అనే వ్యక్తి భార్యా, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతని భార్య కొన్ని సంవత్సరాలుగా అదే గ్రామంలో నివాసం ఉంటున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

భర్త బయటకు వెళ్లిన సమయంలో ప్రియుడితో జల్సా చెయ్యడం మొదలు పెట్టింది. జీతు లోహార్ ఎన్నోసార్లు ఆమెకు బుద్దిమాటలు చెప్పాడు. అయినా ఆమె తన పద్దతి మార్చుకోలేదు. పిల్లలు ఎదుగుతున్నా ఆమె వక్రబుద్దిమారలేదు.
జీతు లోహార్ భార్య ప్రవర్తనపై విరక్తి పెంచుకున్నాడు. తరువాత భార్యతో గొడవపడి, చివరికి సహనం కోల్పోయి కొడవలితో ఆమె తల పూర్తిగా నరికేశాడు. మొండాన్ని బయటకు విసిరివేసి తల మాత్రం ఇంటిలో పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు జీతు లోహార్ ను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications