వామ్మో .. మెట్రో స్టేషన్‌ ఎస్కలేటర్‌పై ... పాడుపని ....

న్యూఢిల్లీ : కాలం మారుతుంది. యువత చేష్టలు కూడా శృతిమించుతున్నాయి. నలుగురిలో .. బహిరంగ ప్రదేశాల్లో శృతిమించి ప్రవర్తిస్తున్నారు. కొందరి చేష్టలు చూసి జనాలే ముక్కున వేలుసుకుంటున్నారు. ఇటీవల గురుగ్రామ్ మెట్రోస్టేషన్‌లో కూడా జుగుప్సకరమైన ఘటన జరిగింది. పబ్లిక్ ప్లేస్‌లో ఓ యువతిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు పోకిరి. అదేంటని ప్రశ్నిస్తే .. తిట్లపురాణం చదివాడు. ఆ రాత్రివేళ తనకు సాయం చేయాలని అరిచినా ప్రయోజనం లేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు స్పందించారు. జరిగిన ఘటనకు క్షమాపణ చెబుతూనే విచారణ ప్రారంభించారు.

పబ్లిగ్గా ..

పబ్లిగ్గా ..

గత శుక్రవారం గురుగ్రామ్‌లోని హుడా సిటీ మెట్రో స్టేషన్ .. తమ తమ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు ఆదర బాదరగా వెళ్లిపోతున్నారు. కానీ ఇంతలో ఒకడు తనకు సిగ్గు, ఎగ్గు లేకుండా ఉన్నాడు. రాత్రి 9.25 గంటలకు ఓ మహిళ ఎస్కలేటర్ దిగుతుంది. ఆమె వెనకాలే ఉన్న పోకిరి చర్యతో ఆమె విస్తుపోయింది. మహిళ ఎస్కలేటర్ దిగుతుండగా సడెన్‌గా ఆమె మెడపై ఎదో తడి పడింది. ఏంటి అని చూసేసరికి వెనుకాల ఓ 29 ఏళ్ల యువకుడు ఉన్నాడు. వాడు అప్పుడే ప్యాంట్ సరిచేసుకోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. హస్తప్రయోగం చేసి తనపై చిమ్మినట్టు గుర్తించింది. వెంటనే ఆ నీచుడి చెంపచెళ్లుమనింపింది. ఆమె తిట్ల దండకం మొదలెట్టగా .. వాడు కూడా రెచ్చిపోయాడు. అసభ్యపదజాలంతో దూషించాడు.

స్పందించని వైనం ...

స్పందించని వైనం ...

ఈ ఘటన తర్వాత తనకు సహయం చేయాలని యువతి అరిచింది. కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో తనకు జరిగిన అవమానం గురించి గురుగ్రామ్ పోలీసు ఫేస్‌బుక్ మేసెంజర్‌లో పోస్ట్ చేశారు. కానీ వారు స్పందించలేదని .. దీంతో డీఎంఆర్సీకి మేసేజ్ చయేడంతో స్పందించారని యువతి వాపోయింది. వెంటనే సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారని పేర్కొన్నారు. ఈ జుగుప్సకరమైన ఘటన గురించి ఫిర్యాదు చేసినా .. చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగిందని గురుగ్రామ్ పోలీసులు అంగీకరించారు. 'మీరు ఫిర్యాదు చేసినందుకు ధన్యవాదాలు, కానీ మేం సరైన స్పందించలేదు .. మమ్మల్ని క్షమించండి అని కోరారు. మీ కాంటాక్ట్ నంబర్, ఇతర వివరాలు తెలియజేయాలి అని‘ యువతిని కోరారు. తదుపరి చర్యలు తీసుకుంటామని .. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

 మితిమీరిన ఆగడాలు

మితిమీరిన ఆగడాలు

ఇటీవల పోకిరిల ఆగడాలు మితిమిరిపోయాయి. పోలీసులు సరైన చర్యలు తీసుకుంటున్న వారి చేష్టలు హద్దుమీరిపోతున్నాయి. కఠిన చట్టాలు తీసుకొచ్చి, శిక్షలు అమలు చేస్తోన్న వారి వైఖరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. దీంతో నిపుణులు, మేధావులతో చర్చించి ఏం చేయాలనే ప్రభుత్వం భావిస్తోంది. వారి ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలా ? లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలా ? అనే మీమాంసలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+