హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబ్రీ మసీదు విధ్వంసం... 22 ఏళ్ల తర్వాత నజీర్ అరెస్టు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బాబ్రీ మసీదు అల్లర్ల కేసు నిందితుడు నజీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఫసీయుద్ధీన్ గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న నజీర్‌ను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు బండ్లగూడలో బుధవారం రాత్రి అరెస్టు చేశారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

బాబ్రీ మసీదు విధ్వంసం నేపథ్యంలో కర సేవకులు పాపయ్య గౌడ్, నందరాజు గౌడ్‌లపై జరిగిన దాడిలో నజీర్ ప్రధాన నిందితుడు. 1992 నుంచి అజ్ఞాతంలో ఉన్న నజీర్‌పై... అబిడ్స్, హుమాయన్ నగర్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు ఉన్నాయి.

Man on the run for 22 years nabbed by CIC sleuths

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నజీర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలు పంపించారు. అనంతరం బెయిల్‌పై వచ్చి దుబాయ్ పారిపోయాడు. 22 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నజీర్‌ దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడని తెలుసుకుని అతడిని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహామ్మద్ అస్ఘర్ అలీ (హరేన్ పాండ్య హత్యకేసులో నిందితుడు), మిర్జా ఫాయజ్ బేగ్, నజీర్ లాంటి యువకులు ఫసీయుద్దీన్ గ్యాంగ్‌లో చేరి నేరాలకు పాల్పడుతున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నజీర్‌ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

English summary
The sleuths of Counter-Intelligence Cell (CIC), in a secret operation carried out late on Tuesday night, picked up Nazeer, allegedly an important member of the Fasihuddin Gang module, from the Old City. The module was allegedly involved in attacking kar sevaks post the Babri Masjid demolition in 1992.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X