తాగొచ్చి వేధిస్తోంది: పోలీసులకు ఓ భర్త మొర
చెన్నై: భర్త తాగి వచ్చి వేధింపులకు పాల్పడుతున్నాడని భార్యలు ఫిర్యాదు చేయడం సాధారణమే. అయితే ఇక్కడ ఇందుకు విరుద్ధంగా జరిగింది. తన భార్య చేత మద్యం మాన్పించాలని ఓ భర్త పోలీసులను ఆశ్రయించి మొర పెట్టుకున్నాడు.
ఈ ఘటన తమిళనాడులోని కొడంగిపట్టిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొడంగిపట్టి గ్రామానికి చెందిన ఓ రైతు తన సోదరి కూతురిని వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు మద్యం సేవించే అలవాటు ఉందని, రోజూ తాగి వచ్చి తనతో గొడవ పెట్టుకుంటోందని వాపోయాడు.

తన భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, ఆమెకు నచ్చజెప్పడం తన కావడం లేదని పేర్కొన్నాడు. దీంతో పోలీసులే ఆమెకి నచ్చజెప్పి తాగుడు మాన్పించాలని కోరాడు. జిల్లా ఎస్పీ మహేశ్ బాధితుడి ఫిర్యాదు స్వీకరించారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications