విమానంలో మహిళపై మూత్రం పోసిన వ్యక్తి ఉద్యోగం ఊడింది: వెల్స్ ఫార్గో కంపెనీ ప్రకటన
న్యూఢిల్లీ: గత ఏడాది నవంబర్ నెలలో ఎయిరిండియా విమానంలో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన ముంబైకి చెందిన శంకర్ మిశ్రా ఉద్యోగం ఊడింది. అతడు పనిచేస్తున్న కంపెనీ వెల్స్ ఫార్గో అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించింది. శంకర్ మిశ్రాపై వచ్చిన ఆరోపణలు తమను తీవ్రంగా కలవరపెడుతున్నాయని కంపెనీ పేర్కొంది.
వెల్స్ ఫార్గో ఉద్యోగుల వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రవర్తన అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉంది. అతనిపై వచ్చిన ఆరోపణలను తమను తీవ్రంగా కలత చెందేలా చేశాయి. ఈ వ్యక్తిని వెల్స్ ఫార్గో నుంచి తొలించాం అని కంపెనీ శుక్రవారం సాయంత్రం ఒక ప్రటనలో వెల్లడించింది.

కాగా, పరారీలో ఉన్న శంకర్ మిశ్రా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అంతేగాక, లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం గమనార్హం.
గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో శంకర్ మిశ్రా.. బిజినెస్ క్లాస్‌లోని ఓ మహిళపై మూత్ర విసర్జన చేశాడు. అయితే, ఈ ఘటన తర్వాత అతడు తన భార్య, బిడ్డపై ప్రభావం చూపుతుందని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని అతను ఆ మహిళను వేడుకున్నాడు.
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుండటంతో.. ఎయిర్ ఇండియా ఈ వారం పోలీసు ఫిర్యాదును దాఖలు చేసింది. "ఇంకా ఎటువంటి ఘర్షణలు జరగలేదు.. మహిళా ప్రయాణీకుల కోరికలను గౌరవిస్తూ, సిబ్బంది ల్యాండింగ్ తర్వాత చట్టాన్ని అమలు చేయకూడదని నిర్ణయించుకున్నారని ఎయిరిండియా తెలిపింది.
ఈ వారం ప్రారంభంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తరువాత, విమానయాన సంస్థ శంకర్ మిశ్రాను 30 రోజుల పాటు విమానయానం చేయకుండా నిషేధించింది.
కాగా, ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA).. ఇప్పుడు ఈ వికృతంగా ప్రవర్తించే ప్రయాణికులపై ఎయిర్‌లైన్ సిబ్బంది చర్య తీసుకోవడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది . ఇలాంటి వ్యక్తులను ఎలాంటి చర్య తీసుకోకుండా వదిలేయడం సరికాదని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications