Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒవైసీపై కాల్పులు జరిపిన వారిలో బీజేపీ కార్యకర్త?: యోగి ఆదిత్యనాథ్‌తో ఫొటో..పార్టీ సభ్యత్వ కార్డు

లక్నో: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకున్న ఈ దశలో ఆయనపై కాల్పులకు పాల్పడటం అన్ని రాజకీయ పార్టీలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఘటన అనంతరం- పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ విస్తృతంగా పాల్గొంటున్నారు. మీరట్‌లోని కితౌర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఢిల్లీలో బయలుదేరిన సందర్భంగా ఆయన ప్రయాణిస్తోన్న కారుపై కాల్పులు జరిపారు. మీరట్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తోన్న సమయంలో మార్గమధ్యలోని ఛజార్సీ టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన సంభవించింది.

Man who shot at AIMIM chief Asaduddin Owaisi, claims to be a member of the BJP

ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విడుదలైంది. ఛజార్సీ టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరపడం స్పష్టంగా ఇందులో కనిపించింది. ఎరుపురంగు హుడీ ధరించిన ఓ యువకుడు తొలుత కాల్పులు జరపడం.. కారు వైపు వేగంగా దూసుకుని రావడంతో అతను కిందపడటం ఇందులో రికార్డయింది. ఆ ఇద్దరినీ సచిన్ పండిట్, శుభమ్‌గా గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. వారిలో సచిన్ పండిట్.. భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

అతణ్ని అదుపులోకి తీసుకున్న తరువాత పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు మొదలు పెట్టారు. అయిదు గంటల పాటు విచారివంచారు. అతని బంధువులు, కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు. సచిన్ పండిట్‌కు చెందిన సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ కార్యకర్త అనే విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. బీజేపీ సభ్యత్వం గుర్తింపు కార్డు, దానికి సంబంధించిన స్లిప్‌ను గుర్తించారు.

దేశ్‌భక్త్ సచిన్ హిందు అనే గుర్తింపు కార్డును అతను తన సోషల్ మీడియా అకౌంట్లల్లో పోస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, ఎంపీ మహేష్ శర్మ, ఇతర బీజేపీ నాయకులతో దిగిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇదివరకు అతనిపై హత్యాయత్నానికి సంబంధించిన కేసు నమోదైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సచిన్ పండిట్.. న్యాయ విద్యను అభ్యసించారు. గ్రేటర్ నోయిడా బాదల్‌పూర్ సమీపంలోని దురై గ్రామం అతని స్వస్థలం.

సచిన్ తండ్రి వినోద్ పండిట్.. గ్రేటర్ నోయిడాలో ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తోన్నాడు. ప్రస్తుతం అతను గ్రేటర్ నోయిడాలో ఓ మ్యాన్ పవర్ ఏజెన్సీని నడిపిస్తున్నాడు. స్థానిక కంపెనీల్లో దినసరి వేతనంపై పని చేయడానికి రోజూ 20 నుంచి 25 మందిని కార్మికులను పంపిస్తుంటాడని తేలింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+