గెలుపే లక్ష్యం: బిజెపితో మణిపూర్ ‘రాజు’ షేక్‌హ్యాండ్

ఈ నెల 4, 8 తేదీల్లో జరిగే మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని బిజెపి భావిస్తున్నది. అందుకోసం తనతో అవసరమైన వారందరినీ కలుపుకుని వెళుతోంది.

ఇంఫాల్: ఈ నెల 4, 8 తేదీల్లో జరిగే మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని బిజెపి భావిస్తున్నది. అందుకోసం తనతో అవసరమైన వారందరినీ కలుపుకుని వెళుతోంది. తొలిదశలో శనివారం 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 78వ 'కింగ్ ఆఫ్ మణిపూర్' రాజ వంశ వారసుడు లైషాంబా సనాజావోబా, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో సభలో కలిసి పాల్గొనడమే దీనికి నిదర్శనం.

ఆరెస్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల విద్యామందిర్ లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న లైషాంబా సనాజావోబాకు ఇప్పటికీ ఆరెస్సెస్‌తో అనుబంధం ఉంది. 2013లో ఇబోబిసింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి రాజ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినా ప్రజల నిరసనతో వెనుకకు తగ్గింది.

1949లో భారత యూనియన్‌లో మణిపూర్ విలీనం సమయంలో రాజుకు గౌరవం ఇవ్వాలని ఒప్పందం జరిగిందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నిబంధనకు అర్హత లేదన్నారు రాజు లైషాంబా సనాజావోబా.. కానీ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాత్రం మహారాజుగా తన గౌరవం, తన ప్యాలెస్ అలాగే ఉంటాయని హామీ ఇచ్చారని చెప్తారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మహారాజాకు గల ప్రభావశీల శక్తి గణనీయమైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాజుతో కలిసి సభలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ రాజు పట్ల గౌరవం ప్రదర్శించడం అంటే మణిపూర్ ప్రజలను గౌరవించడమేనని పేర్కొనడం గమనార్హం.

లైషాంబా సనాజావోబా ఇలా

లైషాంబా సనాజావోబా ఇలా

మణిపూర్ రాజు లైషాంబా సనాజావోబా మాట్లాడుతూ ‘మణిపూర్ రాష్ట్రంలోని వివిధ జాతుల ప్రజలంతా వివిధ సమస్యలు బాధపడుతున్నారు. ఎన్ఎస్‌సిఎన్ (ఐఎం) కారణంగా మణిపూరీల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. మణిపూరీల సమగ్రత దెబ్బతింటుందన్న అనుమానాలు ఉన్నాయి. ఆ భయాలు తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరుతున్నా. బీజేపీ సేతలు మణిపూర్ సమగ్రతతో రాజీ పడబోమని హామీ ఇచ్చారు' అని తెలిపారు. రాజు మాట అంటే మణిపూరీలకు వేదవాక్కని యుమ్నం సత్యవతి పేర్కొంటున్నారు. రాజు, బిజెపి కలిసి పనిచేస్తే సమూల మార్పు సాధించొచ్చని, రాజు ఒక పార్టీకి ఓటేయమని చెప్తే గుడ్డిగా అనుసరించకపోయినా.. పరిగణనలోకి తీసుకుంటామని ఆమె తెలిపారు. తాము 24 గంటల విద్యుత్, సురక్షిత తాగునీరు సరఫరా చేయాలని కోరుతున్నామని అంటున్నారు.

 కొత్త జిల్లాలపై ఇలా..

కొత్త జిల్లాలపై ఇలా..

రాజు, బీజేపీ ఉమ్మడిగా ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో గత నవంబర్ నెలలో మణిపూర్ సీఎం ఇబోబిసింగ్ రాజకీయంగా గట్టి స్ట్రోక్ ఇచ్చారు. మీటీలు, కుకీల ఓటుబ్యాంకును సంఘటితం చేసుకునేందుకు ఏడు కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నాగాలు ఇబోబిసింగ్‌కు దూరమయ్యారు.

బీజేపీ ప్లాన్ ఇదీ..

బీజేపీ ప్లాన్ ఇదీ..

దీని ఫలితంగా గత ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 23 స్థానాలకు 12 స్థానాల్లో బీజెపీ గెలుచుకున్నది. ప్రజలంతా మరిచిపోయిన రాజు ప్రభావాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిజెపి భావిస్తున్నది. ప్రత్యేకించి ఆయన ద్వారా మీటీల మద్దతు పొంది మణిపూర్‌లో పాగా వేయాలని కమలనాథులు ఆశిస్తున్నారు.

కీషింగ్ తర్వాత ఇబోబిసింగ్‌దే రికార్డు

కీషింగ్ తర్వాత ఇబోబిసింగ్‌దే రికార్డు

ఈ దశలో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించి రికార్డు నెలకొల్పాలని యోచిస్తున్న ఇబోబి సింగ్‌కు సొంత పార్టీ కాంగ్రెస్ నుంచే బిజెపిలోకి ఫిరాయింపులు జరుగడం ప్రతికూలాంశమే మరి. ఒకే నేత వరుసగా సీఎంగా కొనసాగడం కాంగ్రెస్ పార్టీలో అరుదుగానే జరుగుతుంది. ఇంతకుముందు 1981 నుంచి 1988 వరకు ఇదే మణిపూర్ రాష్ట్ర సీఎంగా రీషాంగ్ కీషింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

ఇలా ఇబోబి సింగ్ కెరీర్

ఇలా ఇబోబి సింగ్ కెరీర్

అయితే 1984లో స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఇబోబి సింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2002లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబోబిసింగ్ పలు విమర్శలు ఎదుర్కొన్నారు. 2004లో మనోరమాదేవిపై భారత ఆర్మీ అత్యాచారం, హత్య ఘటన పెద్ద దుమారమే రేపింది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని నిరసిస్తూ మహిళలు ఇంఫాల్ నగరంలో అర్థనగ్న ప్రదర్శనకు దిగడంతో ఇంఫాల్ మున్సిపల్ పరిధిలో చట్టం అమలును మినహాయించారు.

ఇదీ ఆర్మీ ప్రాధాన్యం

ఇదీ ఆర్మీ ప్రాధాన్యం

1950వ దశకంలో భారత యూనియన్‌లో మణిపూర్ విలీనం దగ్గర నుంచే వేర్పాటు వాద ఉద్యమాలు మొలకెత్తాయి. అవి క్రమంగా సాయుధ గ్రూపులుగా తొలుత స్వతంత్ర ప్రతిపత్తి కోసం, తర్వాత నాగాలాండ్ లో విలీనం తదితర డిమాండ్లతో ఉద్యమాలు సాగాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ ఉద్యమాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఫలితంగానే దశాబ్ధాల తరబడి మణిపూర్ రాష్ట్రంలో సైనిక బలగాలు తిష్ఠ వేశాయి.

ఇబోబిసింగ్ పై ఇలా..

ఇబోబిసింగ్ పై ఇలా..

ఇబోబి సింగ్ హత్యకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలే జరిగాయి. 2003లో తౌబాల్ లో వెళుతున్న ఆయన కాన్వాయ్ పై మిలిటెంట్లు దాడి చేసిన తప్పించుకోగలిగారు. కానీ ముగ్గురు సెక్యూరిటీ గార్డులు మరణించారు. 2016లో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పైనే ఏకంగా కాల్పులు జరిపారు.

షర్మిల పోటీతో ఆత్మరక్షణలో ఇబోబిసింగ్

షర్మిల పోటీతో ఆత్మరక్షణలో ఇబోబిసింగ్

సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టిన మానవ హక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ఇబోబిసింగ్‌పై తౌబాల్ స్థానం నుంచే బరిలోకి దిగారు. రాష్ట్రంలోని అవినీతిని బట్టబయలు చేయడమే లక్ష్యంగా తాను ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు.

ముందు భార్య.. తాజాగా తనయుడు

ముందు భార్య.. తాజాగా తనయుడు

ఇబోబిసింగ్ తన కుటుంబ సభ్యులకు రాజకీయ వారసత్వం కల్పించడంలో దేశంలోని ఇతర నేతలకేం తీసిపోరు. భార్య ఎల్ లాంధోనీ దేవి సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా, కుమారుడు సూరజ్ కుమార్ సింగ్ తొలిసారి తల్లి నియోజకవర్గం నుంచి అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిజెపిలోకి సొంత పార్టీల నేతల ఫిరాయింపు, ఇరోమ్ షర్మిల పోటీ, ఆర్థిక దిగ్బంధం నివారణలో విఫలమైన ఇబోబిసింగ్ కు ఈ ఎన్నికలు అగ్ని పరీక్ష వంటివేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+