మోడీ నిర్ణయం భేష్...మన్మోహన్ అంత చురుకుగా లేరు: కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్
ఢిల్లీ: ఉగ్రవాదంను అణిచివేయడంలో ప్రస్తుత ప్రధాని మోడీకి ఉన్న ధైర్యం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల సత్తా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజీపీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో షీలా దీక్షిత్ వ్యాఖ్యలు హస్తం పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టేశాయి. షీలాదీక్షిత్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి మంచి అస్త్రంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో షీలా దీక్షిత్ వ్యాఖ్యలను ప్రస్తావించే అవకాశం ఉందని...మోడీ బలమైన నేతని కాంగ్రెస్ ఒప్పుకుంటోందనే ప్రచారం బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు.

ఎన్నికల వేళ జాతీయ భద్రతపై చోటుచేసుకుంటున్న రాజకీయాలపై మాట్లాడుతూ ఢిల్లీ కాంగ్రెస్ ఛీఫ్ షీలా దీక్షిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రత గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పిన షీలా దీక్షిత్ భారత్ ప్రస్తుతం సురక్షితంగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయంగా కలిసి వస్తుందనే ఆలోచనతోనే మోడీ పాకిస్తాన్‌పై దాడులు చేసేందుకు నిర్ణయించుకున్నారని షీలా దీక్షిత్ అన్నారు. షీలా దీక్షిత్ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆమె వెంటనే దిద్దు బాటు చర్యలకు దిగారు. తాను అన్న ఉద్దేశం వేరని ... తన మాటలు వక్రీకరణకు గురయ్యాయని చెప్పారు.
మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడల్లా బాలాకోట్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ పదే పదే గుర్తు చేస్తూ తనను మళ్లీ ప్రధానిగా ఎన్నుకోవాలని ప్రధాని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఎయిర్ స్ట్రైక్స్‌ను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని ధ్వజమెత్తుతోంది. అయితే మన్మోహన్ సింగ్‌పై షీలా దీక్షిత్ ఇలాంటి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. అంతకుముందు కూడా అంటే 2011లో అన్నాహజారే లేవనెత్తిన కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణ, అవినీతిపై పోరాటాలను మన్మోహన్ ఎలా హ్యాండిల్ చేస్తారు అని ప్రశ్నించారు. ఆసమయంలో రాజీనామా కూడా చేస్తానని షీలా దీక్షిత్ ప్రకటించారు కానీ నాడు సోనియా రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ వారించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications