వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నువ్వు కూడా వ్యాక్సిన్ తీసుకున్నావే -జులైలోనే 13కోట్ల టీకాలిచ్చాం -రాహుల్ గాంధీపై మంత్రి మాండవీయ ఫైర్

|
Google Oneindia TeluguNews

''జులై నెల కూడా పోయింది. కానీ, కొవిడ్ వ్యాక్సిన్ల కొరత మాత్రం ఇంకా పోలేదు'' అంటూ కేంద్రంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఘాటు కౌంటరిచ్చారు. విపక్ష నేతలు చెబుతున్నట్లు దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదని, సాక్ష్యాత్తూ రాహుల్ గాంధీనే టీకా తీసుకోవడం ఇందుకు నిదర్శనమని, వ్యాక్సిన్ల పంపిణీని మరింత వేగవంతం చేశామని చెప్పారయన.

Friendship Day:మోదీ ఇద్దరు మిత్రులు -ప్రధానికి రాహుల్ గాంధీ విష్ మామూలుగా లేదుగా -viral videoFriendship Day:మోదీ ఇద్దరు మిత్రులు -ప్రధానికి రాహుల్ గాంధీ విష్ మామూలుగా లేదుగా -viral video

దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని, ఒక్క జులై నెలలోనే 13కోట్లకుపైగా టీకాల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ తెలిపారు. ఆగస్టు నెలలో ఈ ప్రక్రియ మరింత వేగం కానుందని, ఆ టార్గెట్ చేరుకోవడంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల కృషికి గర్విస్తున్నామన్నారు.

Mansukh Mandaviya slams Rahul, says no shortage of covid vaccines, Over 13 cr doses in July

''జులై నెలలో వ్యాక్సిన్‌ తీసుకున్న 13కోట్ల మందిలో రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఆయన స్వయంగా టీకా తీసుకున్న తర్వాత కూడా అది మంచిదనే సందేశం ప్రజలకు చెప్పడంలేదు. దీన్ని బట్టి చూస్తే వ్యాక్సినేషన్‌పై రాహుల్ రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అర్థమవుతోంది. దేశంలో లేనిది వ్యాక్సిన్లు కావు, రాహుల్ కు పరిపక్వత లేదు'' అని మాండవీయ మండిపడ్డారు.

ఈశాన్యంలో రక్తపాతం: ప్రధాని మోదీపై మణిపూర్ సీఎం బీరేన్ కీలక వ్యాఖ్యలు -బీజేపీలోకి మాజీ పీసీసీ చీఫ్ఈశాన్యంలో రక్తపాతం: ప్రధాని మోదీపై మణిపూర్ సీఎం బీరేన్ కీలక వ్యాఖ్యలు -బీజేపీలోకి మాజీ పీసీసీ చీఫ్

Recommended Video

Govt Panel Backs Mixing Covishield, Covaxin Doses | Oneindia Telugu

దేశవ్యాప్తంగా ఆదివారం నాటికి 47.02కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 60లక్షల డోసులను అందించినట్లు పేర్కొంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దేశంలో అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్‌లను సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మెగా డ్రైవ్‌ ప్రారంభించిన జూన్‌ నెలలో దాదాపు 11కోట్ల డోసులను పంపిణీ చేయగా.. జులై నెలలో 13కోట్ల డోసులు పంపిణీ చేస్తామని ముందుగానే తెలిపింది. మొత్తానికి జులై చివరి నాటికి 51కోట్ల డోసులను అన్ని రాష్ట్రాలకు సరఫరా చేయాలనే లక్ష్యాన్ని దాదాపుగా చేరుకున్నట్లేనని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది.

English summary
Union Health Minister Mansukh Mandaviya on Sunday attacked Congress leader Rahul Gandhi over the latter's allegation of vaccine shortage in the country and said that more than 13 crore doses have been administered in the country in July. Quoting Rahul Gandhi's tweet, the Union Health Minister also said that the number of COVID vaccination in the country is going to accelerate this month. "More than 13 crore vaccines have been administered in the country in July. The number is going to accelerate this month," he tweeted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X