పెట్రోల్ బంకుల్లో కొత్త షరతులు- కస్టమర్లల్లో కలకలం

బెంగళూరు: దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణిని ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. గందరగోళానికి దారి తీస్తోంది. ఈ నోటు వాడకంలోనే ఉందని, రద్దు కాలేదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినప్పటికీ- దీన్ని స్వీకరించడానికి వ్యాపార సంస్థలు పెద్దగా ముందుకు రావట్లేదు. వాటిని తీసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. ప్రత్యేకించి పెట్రోల్ బంకుల్లో వాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు.

ప్రత్యేకించి- పెట్రోల్ బంకుల్లో 2,000 డినామినేషన్ నోట్లను తీసుకోవడానికి అక్కడి సిబ్బంది ఏ మాత్రం అంగీకరించట్లేదు. ట్యాంక్ ఫుల్ చేసుకున్నా గానీ తమ వద్ద చిల్లర లేదంటూ ముఖం మీదే తేల్చి చెబుతున్నారు. పెద్ద నోట్లను తీసుకోమని స్పష్టం చేస్తోన్నారు. పెపెట్రోల్ బంకుల్లో తాము ఎదుర్కొన్న అనుభవాలను వాహనదారులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోన్నారు. వాటిని రిజర్వ్ బ్యాంక్‌కు ట్యాగ్ చేస్తోన్నారు.

petrolbunk

హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో 2,000 రూపాయల నోట్లను తీసుకోవడానికి సిబ్బంది అంగీకరించట్లేదు. బెంగళూరు పరిస్థితులు దీనికి భిన్నంగా ఏమీ లేవు. పెద్ద నోట్లను తీసుకోవట్లేదంటూ ఏకంగా బోర్డులను సైతం పెట్టడం చాలా చోట్ల కనిపించింది. మరి కొన్ని చోట్ల వాటిని మార్పిడి చేసుకోవడానికి షరతులు సైతం పెట్టారు పెట్రోల్ బంకు సిబ్బంది.

1,000 రూపాయల మేర పెట్రోల్ లేదా డీజిల్ తీసుకుంటే తప్ప పెద్ద నోట్లను స్వీకరించబోమని స్పష్టం చేస్తోన్నారు. బిల్లు మొత్తం 1,000 రూపాయలు, అంతకుమించి ఉంటేనే పెద్ద నోట్లను తీసుకుంటామని సిబ్బంది తేల్చి చెబుతున్నారు. ఈ పరిణామాలు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. పెద్ద నోట్ల చలామణిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేయలేదని నచ్చజెబుతున్నప్పటికీ వినిపించుకోవట్లేదు.

petrolbunk

గతంలో రోజూ 20-30 వరకు 2,000 రూపాయల నోట్లు వచ్చేవని, ఆర్బీఐ ప్రకటన తరువాత ఈ సంఖ్య 180 నుంచి 200లకు పెరిగిందంటూ పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. ఇన్ని నోట్లను తాము మార్పిడి చేయడం కష్టతరమౌతుందని, రొటేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతాయని, అన్నీ 2,000 రూపాయల నోట్లను తీసుకుంటే చిల్లర సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతోనే తాము వాటిని తీసుకోవట్లేదంటూ వివరణ ఇస్తోన్నారు.

ఎల్పీజీ సిలిండర్ల డెలివరీలోనూ ఇదే తరహా సమస్యలు ఉత్పన్నమౌతోన్నాయి. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో నిర్వహించే లావాదేవీల్లో 2,000 రూపాయల నోట్ల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో బిల్లుకు సరిపడే మొత్తాన్ని చెల్లించే వినియోగదారులు ఇప్పుడు 2,000 నోట్ల రూపాయలను చెల్లిస్తోన్నారని, లావాదేవీలను నిషేధించినట్లు ఆర్బీఐ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడం వల్ల తాము వాటిని తిరస్కరించట్లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+