గామన్ ఇండియాపై మావోయిస్టుల దాడి, వాహనాలు బూడిద
పాట్నా: బీహార్ లో మావోయిస్టులు తమ ప్రతాపం చూపించారు. చెప్పిన మాట వినలేదని ఒక కంపెనీకి చెందిన వాహనాలకు నిప్పంటించారు. అక్కడ ఉన్న ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డులను చితకబాది హెచ్చరించి అక్కడి నుండి వెళ్లిపోయారు.
ముజఫర్ నగర్ ఎస్పీ రంజిత్ కుమార్ మిశ్రా కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బీహార్ లోని ముజఫర్ నగర సమీపంలోని కామతౌల్ గ్రామం సమీపంలోని ప్రముఖ ప్రయివేటు నిర్మాణ సంస్థ గామన్ ఇండియా కంపెనీ ఉంది.

శనివారం వేకువ జామున సుమారు 50 మంది సాయుధ నక్సలైట్లు (తుపాకులుతో ఉన్నమావోయిస్టులు) గామన్ కంపెనీ దగ్గరకు వచ్చి చుట్టుముట్టారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు ఉద్యోగుల మీద దాడి చేశారు.
కంపెనీ ఆవరణంలో ఉన్న ఎనిమిది వాహనాలకు నిప్పంటించి బూడిద చేశారు. మీ అంతు చూస్తాం అని వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ రంజిత్ కుమార్ మిశ్రా తెలిపారు.
ఉత్తర బీహార్ వెనుకబడిన ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని మావోయిస్టులు చెలరేగిపోతున్నారని సమాచారం. అక్కడ బడా కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, ప్రయివేటు నిర్మాణ సంస్థల నుంచి భారీగా నిధులు వసూలు చేస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications