మస్కీ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడతో టచ్‌లోకి కాంగ్రెస్ నేతలు, ఫోన్లో మంతనాలు?
న్యూఢిల్లీ: రెండు రోజులుగా అందుబాటులో లేకుండా పోయిన మస్కి అసెంబ్లీ నుండి విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మే 19వ తేది సాయంత్రం యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ తరుణంలో విశ్వాస పరీక్ష లోపుగా మస్కీని అసెంబ్లీకి హజరయ్యేలా కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
రెండు రోజుల క్రితం విధాన సభ ఆవరణలో కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడి నుండి ప్రతాప్ గౌడ అదృశ్యమయ్యారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తమ బలాన్ని నిలుపుకొనేందుకు కాంగ్రెస్ కూటమి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ కోసం ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే హంపనగౌడ బాదర్లి, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి వసంత్ కుమార్, ఎమ్మెల్యే ప్రతాప్ గౌడతో ఫోన్ లో సంప్రదింపులు చేసినట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు.
కాంగ్రెస్ పార్టీ నేతల హమీ మేరకు విశ్వాస పరీక్ష సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసేందుకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. 2008 ఎన్నికల్లో ప్రతాప్ గౌడ బిజెపి అభ్యర్ధిగా విజయం సాధించారు.












Click it and Unblock the Notifications