అభివృద్ధికి ఈశాన్య ఆమడదూరం: ఎమ్మెల్యేల ఆస్తులు ఇంతింతై వటుడింతై.. అన్నట్లు!!

షిల్లాంగ్/ కోహిమ: ఈశాన్య భారత రాష్ట్రాలు నాగాలాండ్, మేఘాలయ అసెంబ్ల్లీలకు బుధవారం పోలింగ్ జరుగనున్నది. ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామికంగా ఈశాన్య రాష్ట్రాలు ప్రగతిలో వెనుకబడి ఉన్నా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తులు 'ఇంతింతై వటుడింతై' అన్నట్లు భారీగా పెరిగిపోయాయి.
మేఘాలయలోని ఎమ్మెల్యేల ఆస్తులు భారీగా 5174 శాతం పెరిగిపోయాయంటే అతిశయోక్తి కాదు. వీరిలో 2013 ఎన్నికల్లో గెలుపొందిన 22 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువే ఎక్కువగా ఉన్నది.

రూ.40 వేల నుంచి రూ.21 లక్షలకు జ్యాండియాంగ్ ఆస్తులు

రూ.40 వేల నుంచి రూ.21 లక్షలకు జ్యాండియాంగ్ ఆస్తులు

మేఘాలయలో హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (హెచ్ఎస్పీడీపీ) ఎమ్మెల్యే డియోస్సార్ట్ నెస్ జ్యాండియాంగ్ ఆస్తులు ఐదేళ్లలో రమారమీ 5174 శాతం పెరిగింది. ఆయన స్వయంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో ఐదేళ్లలో రూ.40 వేల నుంచి రూ.21 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. మళ్లీ పోటీ చేస్తున్న 57 మంది ఎమ్మెల్యేల్లో జ్యాన్‌డియాంగ్ ఆస్తుల విలువ అత్యధికం.

సగటున మేఘాలయ ఎమ్మెల్యేల ఆస్తులు 44 శాతం పెరుగుదల

సగటున మేఘాలయ ఎమ్మెల్యేల ఆస్తులు 44 శాతం పెరుగుదల

ఇక స్వతంత్ర ఎమ్మెల్యే మిచైల్ టీ సంగ్మా ఆస్తి కూడా రమారమీ 1160 రెట్లు పెరిగాయి. 2013లో ఆయన ఆస్తి రూ.6 లక్షలైతే ప్రస్తుతం అది 81 లక్షలకు చేరుకున్నది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాచెల్ అంపారీన్ లింగ్డో ఆస్తి 1213 శాతం పెరిగిం (రూ.21 లక్షల నుంచి రూ.2 కోట్లకు)ది. ఈ విషయాన్ని అసోసియేషన్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. తిరిగి పోటీ చేస్తున్న మేఘాలయ ఎమ్మెల్యేల ఆస్తులు సగటున 44 శాతంతో రూ.3.41 కోట్లు పెరిగాయని ఏడీఆర్ వివరించింది. 2013లో ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ.7.07 కోట్లుగా ఉంటే ప్రస్తుతం ఆ ఆస్తుల విలువ రూ.11.19 కోట్లకు చేరింది.

రెండో స్థానంలో 10 మందితో నేషనల్ పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యేలు

రెండో స్థానంలో 10 మందితో నేషనల్ పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యేలు

మళ్లీ పోటీ చేస్తున్న 57 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది శాసనసభ్యుల ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి. తర్వాతీ జాబితాలో 10 మంది నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ఎమ్మ్యేలు, ఏడుగురు యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ), ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, నలుగురు హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్, మేఘాలయ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరేసి ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చేస్తున్నారు.

మళ్లీ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్న 53 మంది ఎమ్మెల్యేలు

మళ్లీ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్న 53 మంది ఎమ్మెల్యేలు

నాగాలాండ్‌లో పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులు సగటున 41 శాతం పెరిగి రూ.1.24 కోట్లకు చేరాయని ఏడీఆర్ వివరించింది. మళ్లీ నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 53 మంది ఎమ్మెల్యేలు తమ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2013లో వారి సగటు ఆస్తుల రూ.3.06 కోట్లు కాగా, 2018లో అది రూ.4.31 కోట్లకు చేరుకున్నది.

అత్యధికంగా 161% పెరిగిన యిటాచు ఆస్తి

అత్యధికంగా 161% పెరిగిన యిటాచు ఆస్తి

అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నుంచి అత్యధికంగా 28 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తుండగా, నేషనలిస్టు డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) నుంచి 12, బీజేపీ నుంచి తొమ్మిది, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) మూడు, యునైటెడ్ జనతాదళ్ (జేడీయూ) నుంచి ఒక ఎమ్మెల్యే తిరిగి పోటీ చేస్తున్నారు.ఎన్పీఎఫ్ ఎమ్మెల్యే యిటాచు ఆస్తి ఐదేళ్లలో 161 శాతం పెరిగింది. 2013లో రూ.6 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.17 కోట్లు దాటింది.

నాగాలాండ్‌లో జీ కైటో ఆస్తి 305 శాతం ఎదుగుదల

నాగాలాండ్‌లో జీ కైటో ఆస్తి 305 శాతం ఎదుగుదల

ఎన్పీఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీ కైటో ఆయే ప్రస్తుతం జేడీయూ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తి ఐదేళ్లలో రూ.3 కోట్ల నుంచి 305 శాతం పెరుగుదలతో రూ.14 కోట్లకు చేరుకున్నది. 60 స్థానాల నాగాలాండ్ అసెంబ్లీలో అధికార ఎన్పీఎఫ్ నాయకత్వ స్థానంలో ఉన్నది. నాగాలాండ్ అసెంబ్లీకి ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగనున్నది. ఏడు దశాబ్ధాల మిలిటెంట్ ఉద్యమానికి పరిష్కార మార్గం చూపుతూ ‘ఎన్నికలను బహిష్కరించాలి' అని నాగా సంస్థలు ఇచ్చిన పిలుపు వీగిపోయింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎన్ఎస్సీఎన్ - ఐఎంతో మాదిరిగా ఈశాన్య భారతానికి శాంతి కోసం తుది ఒప్పందం రూపొందించాలని వివిధ నాగాలాండ్ పౌర సమాజ సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+