ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ స్పీకర్ మీరా కుమార్
ఊహించిన విధంగానే ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ఎంపిక చేశారు. ఇప్పటికే ప్రకటించిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌తో ఆమె తలపడనున్నారు.
న్యూఢిల్లీ: ఊహించిన విధంగానే ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ఎంపిక చేశారు. దీంతో ఇప్పటికే ప్రకటించిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌తో ఆమె తలపడనున్నారు.
కాగా, 2009-14 మధ్య కాలంలో మీరా కుమార్ లోకసభ స్పీకర్‌గా పనిచేశారు. అంతేగాక, కేంద్రమంత్రిగానూ ఆమె సేవలందించారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ కుమార్తే ఈ మీరా కుమార్. ఆమె స్వస్థలం బీహార్ రాజధాని పాట్నా.

కాగా, గురువారం సాయంత్రం ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో విపక్ష నేతలు రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొదట విపక్షాల తరఫున అభ్యర్థులుగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌ల పేర్లు ప్రముఖంగా విన్పించాయి. కానీ, చివరకు మీరాకుమార్‌నే ఎంపిక చేశారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే నేత కనిమొళి తదితరులు పాల్గొన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications