ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా ‘ఉపాధి హామి’
వాషింగ్టన్: భారతదేశంలో అమలవుతున్న 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం'(ఎంజిఎన్ఆర్ఈజిఏ) ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా పనుల కార్యక్రమంగా ప్రపంచ బ్యాంకు గుర్తింపు పొందింది. దేశంలోని సుమారు 15% మందికి దీని ద్వారా సామాజిక భద్రత లభిస్తోందని ఆ సంస్థ తెలిపింది.
ప్రపంచంలో అతిపెద్ద సామాజిక భద్రత కార్యక్రమాలు చైనా, భారత్, దక్షిణాఫ్రికా, ఇథియోపియా వంటి మధ్యస్థాయి ఆదాయ దేశాల్లోనే అమలవుతున్నాయని ప్రపంచబ్యాంకు నివేదిక తన నివేదికలో పేర్కొంది.

భారత్‌లో బడి పిల్లలకు అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ఆ విభాగంలో ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందిందని తెలిపింది.
జననీ సురక్షా యోజన (అతిపెద్ద సామాజిక భద్రత పథకం), ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం (రెండో అతిపెద్ద బేషరతు నగదు బదిలీ సామాజిక భద్రత పథకం) కూడా ప్రపంచబ్యాంకు గుర్తింపు పొందాయి.












Click it and Unblock the Notifications