రాయగడ్ తీరానికి ఏకే-47లతో బోటు: ఆస్ట్రేలియాకు చెందిన మహిళదే, రంగంలోకి ఎన్ఐఏ
ముంబై: మహారాష్ట్రలోని రాయగడ తీరంలో ఆయుధాలతో లభించిన ఓ పడవ కలకలం సృష్టించింది. ఆ బోటులో మూడు ఏకే-47 రైఫిల్స్ లభ్యమయ్యాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అయితే, దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
లేడీహాన్ అనే పడవ ఆస్ట్రేలియా పౌరురాలు హానా లార్డోర్గాన్ అనే మహిళకు చెందినదని పోలీసులు తేల్చారు. దీంతో ఎలాంటి సెక్యూరిటీ థ్రెట్ లేదని స్పష్టం చేశారు పోలీసులు. మరోవైపు, రాయగడ్ తీరంలో లభించిన ఆ బోటు వద్దకు ఎన్ఐఏ బృందం బయల్దేరింది.
ఒమన్ కోస్ట్ సమీపంలో ఈ ఏడాది జూన్ నెలలో ఈ బోటులోని సిబ్బందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఆయుధాల విక్రయదారును సంప్రదించగా.. మిస్సైనట్లు చెప్పిన ఆయుధాలు ఈ పడవలో ఉన్నాయని తేలింది.

అదే సమయంలో మరో బోటు కూడా భరన్ ఖోల్ కినారా వద్ద లభించింది. దీనిలో పలు పలు డాక్యుమెంట్లు లభించాయి. రెండో బోటులు ఎవరూ కూడా లేరు.
ఆయుధాల బోటుకు సంబంధించిన పూర్తి వివరాలు:
మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకారం.. జేమ్స్ హోబర్ట్ మాట్లాడుతూ.. మస్కట్ నుంచి ఈ బోటు యూరోప్ వెళుతోంది. జూన్ 26న ఉదయం 10 గంటలకు ఇంజిన్ ఫెయిలైంది. దీంతో ఒంటిగంట ప్రాంతంలో సెయిలర్లు సాయం కోసం సంప్రదింపులు జరిపారు. ఓ కొరియన్ వార్‌షిప్.. పడవలోని సిబ్బందిని కాపాడింది. బోటును ఒమన్ కు అప్పగించింది.
రాయగడ్ తీరంలో లభించిన బోటు ఆస్ట్రేలియాకు చెందిన మహిళది. ఈ ఘటనపై సెంట్రల్ ఏజెన్సీలతోపాటు మహారాష్ట్ర పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. త
సముద్రం కొంత అలజడిగా ఉండటంతో బోటును లాగలేకపోయారు. ప్రస్తుతం ఆ బోటు హరిహరేశ్వర్ తీరంలో ఉందని పోలీసులు తెలిపారు. ఈ బోటు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications