పోలీసులపై ఉగ్ర కాల్పులు: ఒకరికి తీవ్రగాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలో బస్టాంట్ వద్ద ఆగివున్న పోలీసు వాహనంపై దగ్గరి నుంచే కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ గుల్హామ్ హసన్ తీవ్రంగా గాయపడినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
హసన్‌ను ఉగ్రవాదులు చాలా దగ్గర నుంచి కాల్చినట్లు ఆయన తెలిపారు. కానిస్టేబుల్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఘటనలో సమయంలోహసన్ వద్ద ఆయుధాలు లేవని, ఆ సమయంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలిపారు.

ఇది ఇలా ఉండగా, పుల్వామా జిల్లాలో సోమవారం నుంచీ ఉదయం ఉగ్రవాదులు, భద్రతాసిబ్బందికి మధ్య కాల్పులు జరిగాయి. బహ్మనో ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో భద్రతాసిబ్బంది ఆ ప్రాంతమంతా తనిఖీ చేపట్టారు. ఆ ప్రాంతంలోనే నక్కిన ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు పాల్పడగా.. జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.












Click it and Unblock the Notifications