కాశ్మీర్: ఎన్ కౌంటర్ లో ఉగ్రవాదులు అంతం (వీడియో)
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో భారత భద్రతా దళాలకు, ఉగ్రవాదుల మద్య భీకరపోరు సాగుతోంది. సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు అంతం అయ్యారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో ఓ సైనికుడు మరణించాడు.
అక్రమిత కాశ్మీర్ నుంచి అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు చోరబడటానికి ప్రయత్నిస్తున్నారని అధికారులకు సమాచారం వచ్చింది. సోమవారం వేకువ జామున నుంచి అధికారులు ఉగ్రవాదులను పట్టుకోవడానికి ప్రయత్నించారు.

అదే సమయంలో సైనికులకు ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. సైనికుల మీద కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు అంతం అయ్యారు. అంతకు ముందు రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో ఓ సైనికుడు మరణించాడు.
లెఫ్టినెంట్ కల్నల్ కు తీవ్రగాయాలైనాయని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి భారీ ఎత్తున బలగాలు మోహరించాయి. పలు సున్నితమైన ప్రాంతాలలో ఆంక్షలు విధించామని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications