వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రైవేట్ పాలపై హైకోర్టు సీరియస్: రెండు వారాలు టైం: సీబీఐతో దర్యాప్తు, ఆంధ్రా పాలు ఔట్ !

ప్రైవేట్ కంపెనీల పాలల్లో రసాయనాలు కలుపుతున్నట్లు వెలుగులోకి రావడంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రైవేట్ కంపెనీల పాలల్లో రసాయనాలు కలుపుతున్నట్లు వెలుగులోకి రావడంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు పాలల్లో రసాయనాలు కలుపుతున్నట్లు వచ్చిన ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని మద్రాస్ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

<strong>చంద్రబాబు తలుచుకుంటే: పళనిసామి సీరియస్, ప్రభుత్వం కూలిపోతోంది!పాల దెబ్బ!</strong>చంద్రబాబు తలుచుకుంటే: పళనిసామి సీరియస్, ప్రభుత్వం కూలిపోతోంది!పాల దెబ్బ!

ఈ విషయంపై త్వరితగతిన విచారించి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు పాలల్లో రసాయనాలు కలుపుతున్నారని తమిళనాడు పాడి, డైరీ అభివృద్ది శాఖ మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ జబ్బులు గ్యారెంటీ !

ఈ జబ్బులు గ్యారెంటీ !

రసాయనాలు కలిపిన పాలు తాగితే క్యాన్సర్, మధుమేహం తదితర వ్యాదులు ప్రబలు తున్నాయని మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఆరోపించారు. ప్రైవేట్ పాలను పరిశోధనకు పంపించామని, రసాయనాల ధ్రువీకరణతో కఠిన చర్యలు తప్పవని మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ హెచ్చరించారు.

మంత్రి ఆరోపణలు లక్షంగా !

మంత్రి ఆరోపణలు లక్షంగా !

మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఆరోపణలు అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాది ఏపీ. సూర్యప్రకాష్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిర బెనర్జీ, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ పిటిషన్ విచారణకు స్వీకరించింది.

పక్క రాష్ట్రాల నుంచి పాలు !

పక్క రాష్ట్రాల నుంచి పాలు !

న్యాయవాది సూర్యప్రకాష్ తన వాదనను బెంచ్ ముందు ఉంచారు. తమిళనాడులో సరఫరా అవుతున్న ప్రైవేట్ పాలు అత్యధికంగా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నవేనని కోర్టు ముందు వివరించారు. ఆయా సంస్థలు పక్క రాష్ట్రాలో ఉన్న దృష్టా తమిళనాడు పోలీసుల ద్వారా విచారణ చెయ్యడం అసాధ్యం అని చెప్పారు.

సీబీఐతో విచారణ జరిపించాలి !

సీబీఐతో విచారణ జరిపించాలి !

ఈ కేసును సీబీఐకి అప్పగించి సమగ్ర విచారణ జరిపించాలని న్యాయవాది సూర్యప్రకాష్ మద్రాసు హై కోర్టులో మనవి చేశారు. పాలలో రసాయనాలు కలిపి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు పాల సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది సూర్యప్రకాష్ కోర్టులో మనవి చేశారు.

మీ ఆరాటం అర్థం అయ్యింది !

మీ ఆరాటం అర్థం అయ్యింది !

ప్రైవేట్ పాలల్లో రసాయనాలు కలుపుతున్న సమాచారం కోర్టు దృష్టికి తీసుకువచ్చిన న్యాయవాదిని మద్రాసు హైకోర్టు అభినందించింది. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న పాలల్లో రసాయనాలు కలుపుతున్నట్లుగా సమాచారం వెలుగులోకి రావడం, దాన్ని మీరు కోర్టు దృష్టికి రావడం సంతోషంగా ఉందని బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ప్రభుత్వం ఏం చేసింది ?

ప్రభుత్వం ఏం చేసింది ?

ప్రైవేట్ పాలల్లో రసాయనాలు కలుపుతున్న వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని మద్రాసు హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ప్రజల జీవితంతో చెలగాటం !

ప్రజల జీవితంతో చెలగాటం !

తమిళనాడు ప్రభుత్వ న్యాయవాది సుబ్రమణ్యన్ జోక్యం చేసుకుని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఓ ప్రత్యేక కమిటీని రంగంలోకి దించుతున్నామని, విచారణ తరువాత ప్రైవేట్ పాల సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది సుబ్రమణ్యన్ కోర్టుకు చెప్పారు.

రెండు వారాలే సమయం !

రెండు వారాలే సమయం !

ప్రభుత్వం విచారణ పూర్తి చెయ్యాలంటే నాలుగు వారాలు గడువుకావాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో మనవి చేశారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించని మద్రాసు హైకోర్టు బెంచ్ రెండు వారాల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణ జూన్ 19వ తేదీకి వాయిదా వేశారు.

ఆంధ్రా పాలు ఔట్ ?

ఆంధ్రా పాలు ఔట్ ?

ప్రైవేట్ పాలల్లో రసాయనాలు కలుపుతున్నారని తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఇటీవల గట్టిగా వాదించారు. చెన్నై నగరంతో సహ తమిళనాడులో ఎక్కవ శాతం సరఫరా అవుతున్న పాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయని తమిళనాడు అధికారులు అంటున్నారు.

విక్రయాలకు బ్రేక్ ?

విక్రయాలకు బ్రేక్ ?

పాలల్లో రసాయనాలు కలుపుతున్నారు ? అని వెలుగు చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అవుతున్న కొన్ని సంస్థల పాల విక్రయాలు నిలిపివేసే అవకాశం ఉందని చెన్నై నగరంలోని ప్రైవేట్ పాల వ్యాపారులు అంటున్నారు. మొత్తం మీద తమిళనాడు ప్రభుత్వం నివేదిక ఎలా ఇస్తుందో ? అంటూ ప్రైవేట్ పాల సంస్థల నిర్వహకులు వేచిచూస్తున్నారు.

English summary
Chennai HC issued ordered to tn government that a detailed report shoul be filed regarding the milk adulteration issue within 2 weeks of period
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X