మైనర్ బాలిక కిడ్నాప్: రేప్ చేసిన యువకుడు
హర్యానా: ఓ 13ఏళ్ల దళిత బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జింద్‌లోని రాంకాలనీలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాలిక బహిర్భూమి వెళ్లేందుకు మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటికి వచ్చింది. ఆ సమయంలోనే ఆమె పొరుగింట్లో ఉండే ప్రదీప్ అనే యువకుడు ఆమెను బైకుపై వచ్చి కిడ్నాప్ చేశాడు.
న్యూకృష్ణకాలనీలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదని బెదిరింపులకు గురి చేసిన నిందితుడు, ఆమెను ఇంటి సమీపంలో వదిలేసి పరారయ్యాడు.

కాగా, బాధిత బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిందీ. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరో ఘటనలో మైనర్ బాలికను తనతోపాటు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన యువకుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మార్చి 16న బాలికను తనతో తీసుకెళ్లి ఆమెను పలు ప్రాంతాల్లో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు.












Click it and Unblock the Notifications