ఆశ చూపించి మైనర్ బాలికపై అత్యాచారం, ఫిర్యాదు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణాలకు అడ్డులేకుండా పోతోంది. బడౌన్ ప్రాంతంలో ఓ పదమూడేళ్ల బాలికను నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురిలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. బాధిత బాలిక తన ఇంటి టెర్రాస్ పైన పడుకున్న సమయంలో.. నిందితులు ఆమెను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. నిందితులు నలుగురిని గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరో ఘటనలో, 35 ఏళ్ల వ్యక్తి ఘజియాబాదులో ఓ మైనర్ బాలిక పైన అత్యాచారం చేశాడు. తన కూతురుకు ఏదో ఆశ చూపించి సదరు వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు వైద్య చికిత్స నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications