స్నేహితుల మందు పార్టీ, చిన్న విషయానికి గొడవ, జంట హత్యలు, భార్యను వదిలేసి!

బెంగళూరు: మద్యం మత్తులో స్నేహితుల మద్య జరిగిన చిన్న గొడవ కారణంగా జంట హత్యలు జరిగిన ఘటన బెంగళూరు నగరంలోని తలఘట్టపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఉత్తరహళ్ళిలోని అయ్యప్ప లేఔట్ లో నివాసం ఉంటున్న సంతోష్ కుమార్ అలియాస్ పిళ్లై, సుబ్రమణి అనే ఇద్దరు పీకలదాక మద్యం సేవించిన స్నేహితుల చేతిలో హత్యకు గురైనారు.

జంట హత్యల కేసులో మహావీర్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని, పరారైన మరో నిందితుడు బాబు కోసం గాలిస్తున్నామని పోలీసులు అన్నారు. సంతోష్ కుమార్, సుబ్రమణి, మహావీర్, బాబు అనే నలుగురు స్నేహితులు. వీరందరూ ఒకే చోట పెయింట్ పని చేస్తున్నారు. సుబ్రమణి భార్యను వదిలేసి 24 గంటలు పీకలదాక మద్యం తాగుతున్నాడు.

Minor issue at the party ended in Two Murder In Bengaluru.

సోమవారం రాత్రి నలుగురు బార్ లో మద్యం కొనుగోలు చేసి భువనేశ్వరి నగర్ లోని శ్రీ శనిమహాత్మ స్వామి దేవాలయం వెనుక వైపు ఉన్న నిర్జనప్రదేశంలోకి వెళ్లారు. నలుగురు అక్కడే పీకలదాక మద్యం సేవించారు. ఆ సమయంలో సుబ్రమణి, సంతోష్ కుమార్ తో మహావీర్, బాబులు గొడవ పెట్టుకున్నారు.

ఆ సమయంలో మాటామాటా పెరగడంతో సహనం కోల్పోయిన మహావీర్, బాబు కత్తితో సంతోష్ కుమార్, సుబ్రమణి మీద దాడి చేశారు. తరువాత సమీపంలోని సిమెంట్ ఇటుకలు (హాలో బ్రిక్స్) తీసుకుని సంతోష్ కుమార్, సుబ్రమణి తలల మీద వేసి దారుణంగా హత్య చేశారు.

మంగళవారం ఉదయం సుబ్రమణి, సంతోష్ కుమార్ హత్యకు గురైన విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యకు గురైన సంతోష్ కుమార్, సుబ్రమణి మద్యంకు బానిసలైనారని పోలీసులు అన్నారు. సుబ్రమణిని అతని భార్యను వదిలిపెట్టి వేరుగా నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+