మిస్ ఇండియాకు కరోనా పాజిటివ్ - మిస్ వరల్డ్ 2021 పోటీలు వాయిదా : 17 మంది కంటెస్టెంట్స్ కు కోవిడ్..!!
ప్రపంచ వ్యాప్తంగా కలకలానికి కారణమైన కరోనా ప్రపంచ అందెగత్తెలను ఎటాక్ చేసింది. ఫలితంగా మిస్ వరల్డ్- 2021 పోటీలు వాయిదా పడ్డాయి. మిస్ ఇండియా-2020 మానస వారణాసి కరోనా బారిన పడ్డారు. మానస తో సహా పలు దేశాలకు చెందిన పలువురు కంటెస్టెంట్స్ కొవిడ్ బారిన పడడంతో మిస్ వరల్డ్ - 2021 పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.ముందుగా నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే గురువారం (డిసెంబర్ 16) ప్యూర్టోరికోలో జరగాల్సి ఉంది.

17 మంది పోటీ దారులకు కోవిడ్
అయితే ఫైనల్‌కు ముందే మానసతో పాటు మరికొందరు పోటీదారులు, సిబ్బందితో కలిపి మొత్తం 17 మంది కొవిడ్ బారిన పడ్డారు. దీంతో ముందు జాగ్రత్తగా అందాల పోటీలను వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తిరిగి మూడు నెలల్లోగా ప్యూర్టో రికోలోని జోస్ మిగ్యుల్ అగ్రెలాట్ కొలిజియంలో మిస్ వరల్డ్ పోటీల ముగింపు షెడ్యూల్ చేస్తామని ఈవెంట్ ఆర్గనైజర్లు ప్రకటించారు. .23 ఏళ్ల మానస వారణాసి 70వ ప్రపంచ సుందరి పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.

మూడు నెలల పాటు వాయిదా
2019వ సంవత్సరంలో జరిగిన పోటీల్లో జమైకా దేశానికి చెందిన టోనీ-ఆన్ సింగ్ మిస్ వరల్డ్ 2019 కిరీటాన్ని గెలుచుకుంది. దీని ద్వారా 70వ ప్రపంచ సుందరి పోటీలకు అర్హత సాధించింది. అయితే ఇంతలోనే కరోనా బారిన పడ్డారు. కాగా ఈ అందాల రాణికి మన భాగ్యనగరంతోనూ అనుబంధం ఉంది. హైదరాబాదులో ఎఫ్ఐఐటీ జేఈఈలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ చదివారు.
Recommended Video

మానస వారణాశికి కరోనా పాజిటివ్
రెండు రోజుల క్రితం హర్నాజ్ కౌర్ సంధు మిస్ యూనివర్స్ కాగా, జమైకాకు చెందిన టోనీ ఆన్ సింగ్ మిస్ వరల్డ్ గా కొనసాగుతున్నారు. ఇక, ఇప్పుడు మిస్ వరల్డ్ గా ఎవరు కిరీటం దక్కించుకుంటారనే ఆసక్తి కొనసాగుతోంది. ఈ సమయంలో కరోనా దెబ్బ కు కంటెస్టెంట్లు వైరస్ బారిన పడటంతో ఈ పోటీలనే వాయిదా వేసారు. మిస్ వరల్డ్ పోటీలను చూడాలంటే మరో మూడు నెలలు వేచి చూడాల్సిందే. ఈ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications