మిజోరం ఎన్నికలు : రెండుపూటల భోజనం.. పిల్లలకు విద్య సమకూరిస్తే చాలు..
మిజోరం రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాలకు గాను ఈ నెల 7 వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా అక్కడ ఎంతో కాలం నుంచి ఆశ్రయం పొందుతున్న మయన్మార్ శరణార్థుల మాటలు అందరిని ఆలోచించేలా చేసాయి. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, తాము గౌరవంగా బతికేలా రెండుపూటల భోజనం, మా పిల్లలకు మంచి విద్యను సమకూరిస్తే చాలని మయన్మార్ శరణార్థులు కోరుకుంటున్నారు. ఏ మనిషైనా తన జానెడు పొట్ట నిండడం కోసమే అహర్నిషలు శ్రమిస్తుంటాడు. అదే అదే మాట ఇక్కడి శరణార్థులు చెబుతున్నారు. తమ జానెడు పొట్ట నింపుకునేందు రెండు పూటల భోజనం, తమ పిల్లలకు సరైన విద్య సౌకర్యాలను కల్పిస్తే చాలని కోరుకుంటున్నారు.
31000 మందికి పైగా మయన్మార్ శరణార్థులు : ప్రస్తుతం మిజోరం రాష్ట్రంలో 31000 మందికి పైగా మయన్మార్ శరణార్థులు ఇక్కడ నివసిస్తున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా మిజోరంలో ఆశ్రయం పొందిన శరణార్థులు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు మాత్రం నిత్యవసరాలను సమకూరిస్తే చాలు అని వారంటున్నారు. రెండేళ్ల కిందట మయన్మార్‌లో జరిగిన సైనిక తిరుగుబాటు కారణంగా వీరంతా ఇక్కడకు వచ్చిచేరారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇప్పటి ప్రభుత్వంలాగే తమకు కనీస అవసరాలు ఉపాధి పరంగా తమకు మద్దతు కొనసాగించాలని వారు కోరకుంటున్నారు. మణిపూర్ అల్లర్ల తర్వాత సుమారు పన్నెండు వేలమంది కుకీలు మిజోరంలోకి తరలివచ్చారు.

ఇందులో కొందరు తమ స్వస్థాలకు తిరిగి వెళ్లారు. మిగతావారికి ఇక్కడ ఉన్న ప్రస్తుత ప్రభుత్వం కనీస సదుపాయాలు కల్పిస్తోంది. 8119 మంది శరణార్థుల పిల్లలు ఇక్కడి రాష్ట్ర పాఠశాలల్లో చదువుకుంటున్నారు. స్థానిక పిల్లలతో పాటు వీరికి కూడా ఉచిత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. మిజోరానికి సుమారు 58 కిలోమీటర్ల దూరంలో మయన్మార్ సరిహద్దు కలదు. ప్రస్తుతం ఇక్కడ తాత్కాలికంగా వెదురు కర్రలతో నిర్మించిన నివాసాల్లో మొత్తం 130 మంది శరణార్థులు సిహ్‌ముయి గ్రామ సమీపంలో నివాసముంటున్నారు.












Click it and Unblock the Notifications