ఏ మంత్రికి ఏ శాఖ?: నిర్మల సీతారామన్‌కు కీలకమైన రక్షణ, అశోక్-సుజనలకు పాతవే
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. 2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలోకి కొత్తగా 9 మందికి అవకాశం కల్పించారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. 2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలోకి కొత్తగా 9 మందికి అవకాశం కల్పించారు.
చదవండి: తెలుగువారికి మోడీ ఝలక్: కేబినెట్లోకి నేనా.. ఓ నేత షాక్, కొత్త మంత్రుల ప్రమాణం.. వీరే
మరో నలుగురు సీనియర్ మంత్రులకు పదోన్నతి కల్పించి కేబినెట్ హోదా ఇచ్చారు. అనంతరం కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు.
చదవండి: మోడీ కేబినెట్: 9 మంది కొత్త మంత్రుల గురించి తెలుసుకోండి
తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌కు కీలకమైన రక్షణ శాఖను అప్పగించారు. టిడిపి మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులకు అవే శాఖలను ఉంచారు.

నిర్మలా సీతారామన్ - రక్షణ శాఖ, భద్రతా వ్యవహారాల సలహా కమిటీ సభ్యురాలు
అరుణ్ జైట్లీ - ఆర్థిక, కార్పోరేట్ వ్యవహారాలు
శివప్రతాప్ శుక్లా - ఆర్థిక శాఖ సహాయమంత్రి
పీయూష్ గోయల్ - రైల్వే శాఖ
ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, నైపుణ్యాభివృద్ధి
ముక్తార్ అబ్బాస్ నక్వీ - మైనార్టీ వ్యవహారాలు
సురేష్ ప్రభు - వాణిజ్య శాఖ
స్మృతి ఇరానీ - సమాచార ప్రసార శాఖ
నితిన్ గడ్కరీ - రవాణా, జలవనరులు, గంగా ప్రక్షాళన, నౌకాయానం
నరేంద్ర సింగ్ తోమర్- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖ
ఉమాభారతి - తాగునీరు, పారిశుధ్యం
హర్దీప్ సింగ్ పూరి- గృహ నిర్మాణం, పట్టణాభిృద్ధి
ఆర్కే సింగ్ - విద్యుత్ శాఖ (స్వతంత్రం)
అల్ఫోన్స్ కన్సంథనమ్ - పర్యాటకం (స్వతంత్రం)
అనంత్ కుమార్ - పార్లమెంటరీ వ్యవహారాలు, రసాయన, ఎరువులు
సంతోష్ గాంగ్వార్ - కార్మిక శాఖ (గతంలో బండారు దత్తాత్రేయ శాఖ)
గజేంద్ర సింగ్ షేఖావత్ - రైతు సంక్షేమం, వ్యవసాయం
వీరేంద్ర కుమార్ - స్త్రీ, శిశు సంక్షేమం, మైనార్టీ సంక్షేమం (సహాయమంత్రి)
సత్య పాల్ సింగ్ -
అశ్విన్ కుమార్ చౌబే - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ సహాయమంత్రి
అనంత్ కుమార్ హెగ్డె - నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి












Click it and Unblock the Notifications