తెలుగువారికి మోడీ ఝలక్: కేబినెట్లోకి నేనా.. ఓ నేత షాక్, కొత్త మంత్రుల ప్రమాణం.. వీరే
కేంద్రమంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేయబోయేవారు రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. కేబినెట్ విస్తరణపై శివసేన తీవ్ర అసంతృప్తితో ఉంది.
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో తొమ్మిది మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ విస్తరణపై శివసేన తీవ్ర అసంతృప్తితో ఉంది.
ప్రధాని మోడీ తొమ్మిది మందిని తీసుకున్నారు. ఇందులో ఐదుగురు లోకసభకు తొలిసారి ఎన్నికైన వారు. తెలుగువారికి చోటు దక్కలేదు. బండారు దత్తాత్రేయ రాజీనామాతో తెలంగాణకు కేంద్రమంత్రి పదవి ఒక్కటి కూడా లేదు.
కొత్త మంత్రుల్లో నలుగురు బ్యూరోక్రాట్లు ఉన్నారు. నలుగురు మంత్రులకు ప్రమోషన్ ఇచ్చారు. పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రదాన్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, నిర్మలా సీతారామన్‌లకు ప్రమోషన్ ఇచ్చారు.

- అల్ఫోన్స్ కన్నంతనం సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేరళకు చెందిన మాజీ ఐఏఎస్. న్యాయవాది. రెండుసార్లు ఎమ్మెల్యే.
- సత్యపాల్ సింగ్ సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇతను మాజీ ఐపీఎస్. ముంబై మాజీ సీపీ. తొలిసారి ఎంపీ.
- గజేంద్ర సింగ్ షేకావత్ సహాయమంత్రిగా ప్రమాణం చేశారు. ఇతనికి చురుకైన నేతగా గుర్తింపు. తొలిసారి ఎంపి.
- హర్దీప్ సింగ్ పూరీ సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన మాజీ దౌత్యవేత్త. మాజీ ఐఎఫ్ఎస్, ఢిల్లీ.
- రాజ్ కుమార్ సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. తొలిసారి ఎంపీ.
- అనంత్ కుమార్ హెగ్డే సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదుసార్లు ఎంపీ.
- డాక్టర్ వీరేంద్ర కుమార్ సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇతను ఆరుసార్లు ఎంపీగా ఉన్నారు.
- అశ్వనీ కుమార్ చౌబే సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- శివప్రసాద్ శుక్లా సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వర్ కీ శపథ్ అంటూ ప్రమాణం చేశారు.
- ముక్తార్ అబ్బాస్ నక్వీ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ఈశ్వర్‌కి శపథ్ అంటూ ప్రమాణం చేశారు.
- నిర్మలా సీతారామన్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈమె ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు.
- పీయూష్ గోయల్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- ధర్మేంద్ర ప్రధాన్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- విస్తరణపై శివసేన అసంతృప్తితో ఉంది. ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టింది.
- రాష్ట్రపతి కార్యాలయానికి ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా బయలుదేరారు.
- మంత్రులు రాష్ట్రపతి ఫవన్ వచ్చారు.
- తనను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై థ్రిల్‌గా ఫీలవుతున్నానని,తాను ఊహించలేదని మరో బిజెపి నేత కెజె అల్ఫోన్స్ చెప్పారు.
- తనను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై బిజెపి నేత హర్‌దీప్ సీంగ్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
- మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ప్రధాని మోడీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే వారితో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications