నేడు తెలంగాణలో మోడీ ఎన్నికల ప్రచారం...తెలుగులో ప్రధాని ట్వీట్
Recommended Video

ఎన్నికల సమరం పీక్ స్టేజెస్‌కు చేరుకుంది. తెలంగాలో పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. జాతీయ పార్టీ నాయకులు ఇప్పటికే తెలంగాణలో పర్యటించి తమ పార్టీలకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే ప్రజాకూటమి తరపున యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు వచ్చి ప్రచారం నిర్వహించారు. ఇక బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ప్రచారం నిర్వహించారు. మంగళవారం రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. అంతకంటే ముందు ఆయన తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వస్తున్నానంటూ ట్వీట్ చేశారు. అయితే ప్రధాని చేసిన ట్వీట్‌లో కాస్త స్పెషాలిటీ ఉంది.
ప్రధాన నరేంద్ర మోడీ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్నారు. ముందుగా నాందేడ్‌కు చేరుకుని అక్కడి నుంచి నిజామాబాద్‌కు వెళతారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు హెలికాఫ్టర్ ద్వారా చేరుకుంటారు. ఇక్కడ కూడా ఓ బహిరంగ సభలో పాల్గొని తిరిగి నాలుగు గంటల సమయానికి హైదరాబాద్‌లోని బేగంపేటకు చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళతారు.

రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడానికి మీ ఆదరాభిమానాలు, ఆశీస్సులను కోరుకుంటున్నాను... NM Mobile app ద్వారా ఈ ర్యాలీ విశేషాలను నిరంతరం చూడండి @BJP4Telangana
— Narendra Modi (@narendramodi) November 27, 2018
నా ప్రియాతి ప్రియమైన తెలంగాణా సోదర సోదరీమణులారా!! ఇవాళ మన తెలంగాణా గడ్డ మీద అడుగుపెcట్టడానికి ఎంతో ఆసక్తిగా, ఎదురు చూస్తున్నాను... మొదటగా నేను నిజామాబాద్ ర్యాలీలో మాట్లాడిన తరువాత మహబూబ్ నగర్ లో మీతో నా భావాలు పంచుకొంటాను... @BJP4Telangana
— Narendra Modi (@narendramodi) November 27, 2018
ప్రధాని ఎన్నికల ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో ఆయన తెలంగాణ ప్రజలకు ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌ను తెలుగులో చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో మోడీ పర్యటించినప్పుడల్లా కచ్చితంగా తన ప్రారంభ ఉపన్యాసంలో తెలుగు వచ్చేలా జాగ్రత్త పడతారు. అయితే ఈ సారి ట్వీట్‌ను తెలుగులో చేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. "నా ప్రియాతి ప్రియమైన తెలంగాణా సోదర సోదరీమణులారా!! ఇవాళ మన తెలంగాణా గడ్డ మీద అడుగుపెcట్టడానికి ఎంతో ఆసక్తిగా, ఎదురు చూస్తున్నాను... మొదటగా నేను నిజామాబాద్ ర్యాలీలో మాట్లాడిన తరువాత మహబూబ్ నగర్ లో మీతో నా భావాలు పంచుకొంటాను..."అని ఒక ట్వీట్ చేయగా రెండోది "రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడానికి మీ ఆదరాభిమానాలు, ఆశీస్సులను కోరుకుంటున్నాను... NM Mobile app ద్వారా ఈ ర్యాలీ విశేషాలను నిరంతరం చూడండి" అంటూ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications