మోడీ ఎఫెక్ట్: ఎన్నికల్లో పోటీ కోసం జోరుగా దరఖాస్తులు

రాష్ట్రంలో 80 లోకసభ స్థానాలు ఉండగా ఇప్పటికే 800 మందికి పైగా అధిష్టానం వద్ద పోటీ చేస్తామని దరఖాస్తులు పెట్టుకున్నారట! ఇదంతా మోడీ హవానే అంటున్నారు. 'గుజరాత్ మోడల్ భారత్' అంటున్న మోడీ వైపు దేశంలో యువత ఎక్కువ మంది చూస్తున్న విషయం తెలిసిందే.
మోడీ ఆకర్షణ కారణంగా ఆయనను బిజెపి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. యూపిలో బిజెపికి ప్రస్తుతం పదిమంది ఎంపీలు ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి నేతలు రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలుచుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు.
అదే సమయంలో మోడీ ప్రకటన మరింత కలిసి వచ్చింది. యూపి ప్రజలు కూడా మోడీని ప్రధానిగా కోరుకుంటున్నారని చెబుతున్నారు. అందుకు ఆయన అభ్యర్థిత్వం ప్రకటన తర్వాత పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న అభ్యర్థుల చిట్టా పెరుగుతుండటమే మంచి ఉదాహరణ అని చెబుతున్నారు. మోడీ గుజరాత్ నుండి కాకుండా యుపి నుండి పోటీ చేస్తే 80 స్థానాలలో మెజార్టీ సీట్లు తమవే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications