నష్టాలు భరించిన చమురు సంస్థలకు కేంద్రం దివాళీ బోనంజా: 22 వేల కోట్లు గ్రాంట్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దివాళీ బోనంజా ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు భారీ మొత్తం బోనస్ అందించగా, చమురు సంస్థలకు గ్రాంట్ విడుదల చేసింది. దేశీయ ఎల్‌పీజీ ధరల వల్ల కలిగే నష్టాల కోసం ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు (పీఎస్‌యు ఓఎంసి) వన్‌టైమ్ గ్రాంట్‌గా రూ. 22,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది.

జూన్ 2020 నుంచి జూన్ 2022 మధ్య ఎల్‌పీజీ అంతర్జాతీయ ధరలు దాదాపు 300 శాతం పెరిగాయని ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ, అంతర్జాతీయ ఎల్పీజీ ధరలలో హెచ్చుతగ్గుల నుంచి వినియోగదారులను నిరోధించేందుకు.. ఖర్చు పెరుగుదల పూర్తిగా దేశీయ ఎల్పీజీ నియోగదారులకు బదిలీ చేయలేదు. దీంతో కాలంలో దేశీయ ఎల్‌పిజి ధరలు 72 శాతం మాత్రమే పెరిగాయి. ఇది ఈ ఓఎంసీలకు గణనీయమైన నష్టాలకు దారితీసిందని ప్రభుత్వం తెలిపింది.

 Modi Govts Diwali bonanza: Oil firms get Rs 22,000 cr to counter LPG losses

మూడు చమురు మార్కెటింగ్ కంపెనీలకు - ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఫీసీఎల్) వన్-టైమ్ గ్రాంట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రైల్వే ఉద్యోగులకు బోనస్‌లను కూడా ప్రభుత్వం ఆమోదించింది.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. రైల్వేలోని 11.27 లక్షల మంది ఉద్యోగులకు రూ. 1,832 కోట్ల ఉత్పాదకత ఆధారిత బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇది 78 రోజుల బోనస్, రూ. 17,951 గరిష్ట పరిమితిగా ఉంటుంది." అని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+