సాధారణ మహిళగా ప్రధాని మోడీ భార్య జీవితం ఇలా!

గాంధీనగర్: ఏ దేశంలోనైనా ప్రధాని భార్య అంటే సకల సౌకర్యాలు, సకల మర్యాదలతో దేశంలో అత్యున్నత స్థాయి వ్యక్తిగా గౌరవించబడతారు. అయితే, మన దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదాబెన్ మాత్రం సాధారణ మహిళగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

చిన్నతనంలోనే నరేంద్ర మోడీని వివాహం చేసుకున్న జశోదాబెన్.. కొన్ని రోజులకే వేర్వేరుగా ఉండటం మొదలుపెట్టారు. మోడీ సూచనతోనే ఆమె తన చదువును కొనసాగించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు చేపట్టానని జశోదాబెన్ పలుమార్లు మీడియాకు తెలిపారు.

Modi's wife Joshoda Ben normal life

ప్రస్తుతం ఆమె ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేశారు. భర్త మోడీ నుంచి చాలా కాలంగా దూరంగా ఉంటున్న ఆమె.. గుజరాత్‌లోని ఉంజా పట్టణం బ్రాహ్మణవాడ గ్రామంలోని తన సోదరుడు అశోక్‌భాయ్ ఇంట్లో నివసిస్తున్నారు.

అక్కడే కొన్నేండ్ల నుంచి కిరాణ దుకాణాన్ని నడిపిస్తున్నారు. టీచర్‌గా పదవీవిరమణ చేసిన జశోదాబెన్.. ఒకవైపు కిరాణ దుకాణాన్ని నడిపిస్తూనే తీరిక సమయాల్లో స్థానిక చిన్నారులకు పాఠాలు కూడా బోధిస్తున్నారు. ఇటీవల అక్కడికి వెళ్లిన ఓ ఫొటోగ్రాఫర్.. జశోదబెన్ కిరాణ వస్తువులు అమ్ముతుండగా ఫొటో తీశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+