అపురూప కానుక: మెర్కెల్‌కు మోడీ కృతజ్ఞతలు

న్యూఢిల్లీ: 10వ శతాబ్దానికి చెందిన దుర్గామాతా విగ్రహాన్ని తిరిగి ఇచ్చినందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత పురాతనమైన ఈ మహిషాసుర మర్దిని విగ్రహం జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా దేవాలయం నుంచి చోరీ కాబడి, 1990లో జర్మనీలోని లిండన్ మ్యూజియానికి చేరుకుంది.

ఇప్పుడు ఆ విగ్రహాన్ని మూడు రోజుల భారత పర్యటనకు వస్తున్న సందర్భంగా ఏంజెలా మెర్కెల్ తన వెంట తీసుకువచ్చారు. ప్రధాని మోడీతో ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చల అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్‌కు కానుకగా ఇస్తున్నట్టు మెర్కెల్ తెలిపారు.

Modi thanks German Chancellor Angela Merkel for return of Durga statue

హైదరాబాద్ హౌస్‌లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ఈ విగ్రహాన్ని మెర్కెల్ స్వయంగా తన చేతులతో మోడీకి అందజేశారు. ఆనందంతో విగ్రహాన్ని స్వీకరించిన ప్రధాని మోడీ ఈ విగ్రహం జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినదని ఆయన పీఎంవో ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

చెడుపై మంచి విజయానికి ఈ విగ్రహం ప్రతీక అని ఆయన అభివర్ణించారు. భారతీయులకు జర్మనీ వాసులు అందించిన అపురూప కానుకగా దీనిని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+