ఒడిశా సీఎంగా మోహన్ చరణ్​ మాఝీ ప్రమాణం: మోడీ, నవీన్ పట్నాయక్​ హాజరు

భువనేశ్వర్: ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రెండున్నర దశాబ్దాలుగా ఒడిశాను ఏలిన బీజేడీ పాలనకు ముగింపు పలుకుతూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మోహన్​ చరణ్​ మాఝీ. గవర్నర్ రఘుబర్ దాస్​ బుధవారం ఆయన చేత ప్రమాణం చేయించారు. మోహన్‌​తో పాటు కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరీదా ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

మరికొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌​లోని జనతా మైదానంలో జరిగిన ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్​ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, తదితరులు హాజరయ్యారు.

Mohan Charan Majhi swearing in as Odisha CM Modi Patnaik present

మూడో గిరిజన సీఎంగా మాఝీ రికార్డుల్లోకెక్కారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగ్ మాత్రమే ఒడిశాకు గిరిజన ముఖ్యమంత్రులుగా పనిచేయగా, ఇప్పుడు మాఝీ మూడో గిరిజన ముఖ్యమంత్రిగా నిలిచారు.

మోహన్ చరణ్ మాఝీ రాజకీయ ప్రస్థానం

ఒడిశా ముఖ్యంమత్రిగా ఎన్నికైన మోహన్‌ చరణ్​ మాఝీ ప్రముఖ గిరిజన నేత. ఆయన తండ్రి ఒక సెక్యూరిటీ గార్డుగానూ పనిచేసేవారు. ఆధ్యాత్మిక భావాలు గల మోహన చరణ్ మాఝీ విద్యార్థి దశ నుంచి ఆర్​ఎస్​ఎస్‌​కు దగ్గరయ్యారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సరస్వతీ విద్యామందిర్‌లో ఉపాధ్యాయునిగా పని చేశారు. ఆ తర్వాత న్యాయవాదిగా కొన్నిరోజులు పనిచేశారు.

అనంతరం 1997 నుంచి 2000 వరకు మాఝీ సర్పంచిగా పనిచేశారు. బీజేపీ గిరిజన మోర్చాకు ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడైన మాఝీ.. కేంఝర్‌ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు 2000, 2009, 2019, మళ్లీ 2024లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 నుంచి 2024 వరకు శాసనసభలో బీజేపీ సభాపక్ష కార్యదర్శిగా, చీఫ్‌ విప్‌గా విధులు నిర్వహించారు.

కాగా, ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండున్నర దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని పాలించిన నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌ ఘోర పరాజయం పాలైంది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 78 చోట్ల గెలిచింది.

బిజు జనతా దళ్‌ 51, కాంగ్రెస్‌ 14, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును చెప్పకుండానే ఎన్నికల్లో దిగిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను కైవసం చేసుకుంది. లోక్‌సభ స్థానాల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. మొత్తం 21 లోక్‌సభ స్థానాలకుగాను 20చోట్ల కాషాయ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్‌ పార్టీ ఒక స్థానం దక్కించుకుంది. అయితే, బీజేడీకి ఒక్కస్థానం కూడా దక్కలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+