మోల్నుపిరావిర్, కార్బెవ్యాక్స్, కోవోవ్యాక్స్-కోవిడ్ పై భారత్ పోరులో కొత్త అస్త్రాలు
కోవిడ్ 19పై భారత్ చేస్తున్న పోరులో ఇవాళ మరో మూడు అస్త్రాలు వచ్చి చేరాయి. ఇందులో రెండు వ్యాక్సిన్లు కాగా.. మరొకటి ట్యాబ్లెట్. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఓ ట్వీట్ చేశారు. ఇప్పటికే కేంద్రం ఆమోదించిన మూడు వ్యాక్సిన్లకు ఈ రెండు అదనం. ఇప్పటికే భారతదేశం తన టీకా కార్యక్రమంలో కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ Vలను ఉపయోగిస్తోంది.
Recommended Video
హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఇ తయారు చేయనున్న కార్బెవాక్స్ ప్రొటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్ కాగా... కోవోవాక్స్, పూణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఇది నానోపార్టికల్ ఆధారిత వ్యాక్సిన్. కార్బెవాక్స్‌ను బయోలాజికల్ E, యునైటెడ్ స్టేట్స్‌లోని హ్యూస్టన్‌లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, అమెరికన్ కంపెనీ డైనవాక్స్ టెక్నాలజీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

కోవోవ్యాక్స్ యూఎస్ కు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ నోవా వ్యాక్స్ లైసెన్స్‌తో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాక్సిన్. అలాగే కోవోవ్యాక్స్ అత్యవసర వాడకం కోసం ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం కూడా పొందింది. అలాగే కోవాక్స్ సిరీస్ లో భాగంగా ప్రపంచంలోని కనీసం 40% మంది ఈ టీకాను తీసుకున్నారు.
మరోవైపు ఫైజర్ కు చెందిన పాక్స్ లోవిడ్ తయారు చేసిన మోల్ను ఫిరావిర్ క్యాప్యూల్ కూడా భారత్ లో అందుబాటులోకి వచ్చింది. యూఎశ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (U.S. FDA) ద్వారా ఈ నెలలో ఆమోదించబడిన మోల్నుపిరవిర్, తేలికపాటి, మితమైన వ్యాధి ఉన్నవారికి మంచి మందు అని భావిస్తున్నారు. అలాగే సులభంగా తీసుకునే మాత్రగా కూడా ఇస్తున్నారు. భారతదేశంలోని 13 కంపెనీలు ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కోవిడ్ సోకిన పెద్దలకు "వ్యాధి ముదిరే ప్రమాదం ఎక్కువగా ఉన్న" చికిత్స కోసం అత్యవసర వినియోగ అధికారం కింద దీన్ని ఆమోదించారు.
వైరస్‌లో జన్యుపరమైన అంశాల్ని ప్రవేశపెట్టడం ద్వారా మోల్నుపిరవిర్ పని చేస్తున్నందున, దీనిని జాగ్రత్తగా సూచించాలని, నివారణగా సిఫార్సు చేయబడదని, ప్రత్యామ్నాయ కోవిడ్ చికిత్స కోసం కొందరు ఎంపిక చేసిన వారికి మాత్రమే ఇవ్వాలని యూఎస్ సూచిస్తోంది.
భారత్ లో సిప్మోల్ను బ్రాండ్ పేరుతో మోల్నుపిరవిర్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు లైసెన్స్‌దారుల్లో ఒకరైన సిప్లా ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఈ టీకాలు ఎప్పుడు చేర్చబడతాయి అనేది ఇంకా నిర్ణయించలేదు. జనవరి 3 నుంచి 15-17 ఏళ్ల మధ్య వయసున్న వారు కోవాక్సిన్‌కు అర్హులని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఇప్పటికే రెండు డోస్ లు తీసుకున్న 60 ఏళ్లు పైబడిన వారు జనవరి 10 నుండి మూడవ డోస్‌కు అర్హులు. రోగలక్షణ ఇన్‌ఫెక్షన్ నుండి రక్షణ కల్పించడంలో కొత్త వ్యాక్సిన్‌లు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో చూపించడానికి ఇప్పటివరకు ఎటువంటి అధ్యయనాలు లేవు.
.












Click it and Unblock the Notifications