దారుణం:కొడుకును హత్య చేయించిన తల్లి, ఎందుకో తెలుసా?

Posted By:
Subscribe to Oneindia Telugu

జైపూర్: ఆస్తి కోసం అల్లుడితో కలిస కన్న కొడుకును కిరాయి హంతకులతో తల్లి హత్య చేసిన ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలో చోటు చేసుకొంది. రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతాప్‌ఘడ్ జిల్లా చోటిసాద్రి గ్రామానికి చెందిన మోహిత్ తల్లి ప్రేమ్‌లత సుతార్‌తో తరచూ గొడవ పడేవాడు ఆస్తి విషయమై వీరిద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకొన్నాయి.

తండ్రి చనిపోయిన తర్వాత మోహిత్‌కు కొడుకు మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఈ గొడవలు తీవ్రం కావడంతో ప్రేమలత తన కూతురు దగ్గరికి వెళ్ళి నివాసం ఉంటుంది అయితే నెల క్రితం ఆమె తన ఊళ్లోని భూమిని విక్రయించేందుకు ప్రేమలత ప్రయత్నించింది. అయితే మోహిత్ అడ్డుపడ్డాడు

Mom paid Rs 1 lakh to contract killer to murder son in Rajasthan

మోహిత్ ఉన్నంత కాలం భూముల విక్రయించలేమని ప్రేమలత భావించింది. కొడుకును అడ్డు తొలగించుకొంటేనే భూముల విక్రయం సాగే అవకాశం ఉందని ఆమె భావించింది. ఈ మేరకు అల్లుడితో కలిసి కొడుకును హత్య చేయించాలని కుట్ర పన్నింది. మోహిత్‌ను చంపేందుకు స్థానికంగా ఉన్న రౌడీ షీటర్ గణపత్ సింగ్‌ రాజ్‌పుత్‌తో ప్రేమలత ఒప్పందం కుదుర్చుకొంది.

తన కొడుకును హత్య చేస్తే రూ.1లక్ష ఇస్తానని ఆమె గణపత్‌సింగ్‌తో ఒప్పందం చేసుకొంది. అంతేకాదు అడ్వాన్స్‌గా రూ. 50వేలు చెల్లించింది. ఏప్రిల్ 6న మోహిత్ గ్రామానికి దగ్గరల్లో ఉన్న దాబా వద్దకు వెళ్ళాడు. అక్కడే ఉన్న గణపత్, అనిల్‌లు పథకం ప్రకారంగా మోహిత్‌కు మద్యం తాగించారు. మోహిత్ మత్తులోకి దిగిన తర్వాత అతడిని గొంతు పిసికి చంపేశారు. అయితే ఈ కేసులో నిందితులను సీసీటీవి పుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In an unbelievable incident, a mother connived with her son-in-law and four others to get killed her son over property dispute in Chhoti Sadri of Pratapgarh district. The woman had paid Rs 1 lakh to a contract killer, a highway dhaba owner, where her son frequently visited.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X