కోతులు చేసిన పనికి విమానానికి బ్రేకులు.. రన్‌వే పై రచ్చ రచ్చ
విమానం నింగిలోకి ఎగిరేందుకు రన్‌వేపై వేగంగా దూసుకెళ్తోంది.. కొద్ది క్షణాల్లో చక్రాలు నేల విడవాలి.. సరిగ్గా అదే సమయంలో రన్‌వే మధ్యలోకి అకస్మాత్తుగా కోతుల గుంపు ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా పైలట్లు అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
దాదాపు 170 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఉన్న లక్నో-రాయ్‌పూర్ ఇండిగో విమానం (6E6521) టేకాఫ్ కోసం సిద్ధమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి క్లియరెన్స్ రావడంతో విమానం రన్‌వే 09Cపై సుమారు 200 మీటర్ల దూరం వేగంగా కదిలింది. అయితే, రన్‌వేపై కోతులని గుర్తించిన పైలట్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేకాఫ్‌ను తక్షణం రద్దు చేశారు. ఆ తర్వాత విమానాన్ని టాక్సీవే గుండా ఏప్రాన్‌కు తీసుకెళ్లి అన్ని వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరకు భద్రతా పరమైన తనిఖీలు పూర్తయిన తర్వాత, ఉదయం 8:55 గంటలకు బయల్దేరాల్సిన ఇండిగో విమానం సుమారు గంట ఆలస్యంగా 10:04 గంటలకు రాయ్‌పూర్‌కు బయలుదేరింది.

ఆకాశంలోనే చక్కర్లు కొట్టిన మరో విమానం
కోతుల కారణంగా ఇతర విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. రన్‌వే క్లియర్‌గా లేకపోవడంతో ల్యాండింగ్ కోసం సిద్ధమైన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX 1392) 'గో-అరౌండ్' చేయాల్సి వచ్చింది. రన్‌వేపై కోతులు లేవని నిర్ధారించుకునే వరకు ఆ విమానం లక్నో గగనతలంపై రెండుసార్లు చక్కర్లు కొట్టింది.
మొదటిసారి ఇలాంటి ఘటన..
విమానాశ్రయ చరిత్రలో రన్‌వేపైకి కోతులు వచ్చి విమానాలకు అంతరాయం కలిగించడం ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు. ఆ కోతులు రహీమాబాద్‌లోని మామిడి తోటల నుంచి విమానాశ్రయ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉండవచ్చని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని విమానాశ్రయ వర్గాలు స్పష్టం చేశాయి.
#BREAKING : IndiGo Flight Aborts Take-Off in Lucknow After Monkeys on Runway
— upuknews (@upuknews1) May 1, 2026
An IndiGo flight from Lucknow to Raipur aborted its take-off on Thursday morning after monkeys were spotted on the runway.
The aircraft had already begun its take-off roll when the animals strayed onto… pic.twitter.com/ld2BEZ8rIA














Click it and Unblock the Notifications