అంబానీ నెల కరెంట్ బిల్లుతో ఎన్ని వేల ఇళ్లకు కరెంట్ ఇవ్వొచ్చో తెలుసా...?
2024వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలుకాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి.ఇక ఏడాదే ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగవైభంగా జరిగింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లు వివాహం బంధంతో ఒక్కటయ్యారు. అంబానీ ఇంట మూడురోజులపాటు పెళ్లి వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలంతా ఈ వివాహానికి తరలివచ్చారు.
ముంబయిలోని వీధులన్నీ అతిథులతో నిండిపోయాయి.దాదాపుగా 2500 మంది ముఖ్యఅతిథులుగా వచ్చారని తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అంబానీ ఇంట పెళ్లిలో తెగ సందడి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు సైతం ఈ వివాహానికి రావడం జరిగింది. టీమిండియా క్రికెటర్లు , మాజీ ఆటగాళ్లు సైతం ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

అలాగే ఈ పెళ్లికి రూ.5000 కోట్లు ఖర్చు అయ్యాయి. అంబానీ ఆస్తుల్లో రూ.5000 కోట్లు అంటే 0.05 శాతం మాత్రమే.ఇది వారికి చాలా అంటే చాలా చిన్న ఖర్చు. అలాగే ఈ ఏడాది అంబానీకి సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. 2024లో అంబానీ నెల కరెంట్ బిల్లు కూడా హాట్ టాపిక్‌గా మారింది. అంబానీ ఇంటికి నెలనెలా వచ్చే విద్యుత్ బిల్లు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అంబానీ ఇంటికి విద్యుత్ బిల్లు అక్షరాలా రూ.70 లక్షలు వస్తుందట.
ఎందుకంటే ఆంటీలియా భవనం మొత్తం ప్రతి నెలా 6,37,240 యూనిట్ల కరెంట్ వినియోగిస్తోంది. దీనికి కారణంగానే నెలకు కరెంట్ బిల్లు రూ.70 లక్షలు తగ్గకుండా వస్తుందని తెలుస్తోంది. అంబానీ ఇంటికి సప్లై చేసే విద్యుత్తుతో 7 వేల మధ్యతరగతి ఇళ్లకు సరిపడా కరెంట్ సప్లై చేయొచ్చట. ముంబైలో ముఖేష్ నీతా అంబానీ దంపతులకు అత్యంత ఖరీదైన భవనం కలిగి ఉందనే విషయం తెలిసిందే. 27 అంతస్తుల కలిగిన ఈ భవనాన్ని ఆంటీలియా అని పిలుస్తుంటారు.ఈ భవనం ఖరీదు రూ.15 వేల కోట్లు. ముంబైలోని బాంద్రాలో ఈ భవనం ఉంది.












Click it and Unblock the Notifications