ముగ్గురు కూతుళ్లను హత్య చేసి తల్లి ఆత్మహత్య
బెంగళూరు: కుటుంబ సమస్యల కారణంగా ముగ్గురు కుమార్తెలను హత్య చేసిన తల్లి తరువాత ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలో జరిగింది. ఆర్థిక సమస్యలతో ఒకే కుటుంబంలో నలుగురు ఈ విధంగా అసువులు బాయడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ముదోళ తాలుకా మహాలింగపురం పట్టణంలోని బావికట్టి ప్రాంతంలో మాన్వికి చెందిన రాజేశ్వరి (40) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు పుష్ప (19), సాధన (15), సహన (11) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం రాజేశ్వరికి వివాహం అయ్యింది.

తరువాత మహాలింగపురం వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. 10 సంవత్సరాల క్రితం తనకు ముగ్గురు కుమార్తెలు పుట్టారు. తాను పోషించలేనని రాజేశ్వరి భర్త ఇల్లు వదలి వెళ్లిపోయాడు. తరువాత అతను తిరిగి రాలేదు. అప్పటి నుండి రాజేశ్వరి కూలి పని చేస్తు బిడ్డలను పోషిస్తున్నది.
ముగ్గురు కుమార్తెల పోషణ భారం అయ్యింది. చుట్టు పక్కల ఉన్న ఆకతాయిలు అమ్మాయిలను వేధించడం మొదలు పెట్టారు. ఈ బాధలు తట్టుకొలేని రాజేశ్వరి శనివారం వేకువ జామున ముగ్గురు కుమార్తెల గొంతు బిగించి హత్య చేసింది. తరువాత ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications