• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తరుముకొస్తోన్న చైనా యుద్ధ విమానాలు: ప్రతీకారానికి భారత్ సన్నద్ధం కావాల్సిందే: బీజేపీ ఎంపీ

|

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద తాజాగా భారత్, చైనా సైనికుల మధ్య తాజాగా చోటు చేసుకున్న ఘర్షణ.. యుద్ధానికి దారి తీస్తోందా? చైనా మరోసారి భారీ ఎత్తున తన సైనికులు, యుద్ధ సామాగ్రి, సుఖోయ్ యుద్ధ విమానాలను సరిహద్దుల్లో మోహరింపజేస్తోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఇచ్చారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి. చైనా యుద్ధానికి సన్నద్ధమౌతోందని, భారత్ ప్రతీకార దాడులకు సిద్ధపడక తప్పదనీ ఆయన స్పష్టం చేశారు. యుద్ధ సంకేతాలను చైనా పంపించినట్టయిందని అన్నారు.

  Army Chief Naravane in Leh యుద్ధానికి చైనా, ప్రతీకారానికి భారత్ సన్నద్ధం: బీజేపీ ఎంపీ || Oneindia

  వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పంగ్యాంగ్ త్సొ లేక్ వద్ద కిందటి నెల 29, 30 తేదీల్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నిచంగా.. భారత జవాన్లు వారిని అడ్డుకున్నారు. వారి ప్రయత్నాలను విఫలం చేశారు. భారత భూభాగంపైకి నియంత్రించారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట చోటు చేసుకుందని, ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని ఆర్మీ అధికారులు ధృవీకరించారు.

  Moving of Chinese Sukhoi planes in large numbers, India to get ready for retaliation

  ఈ పరిణామాలతో కేంద్ర అప్రమత్తమైంది. హస్తినలో శరవేగంగా కీలక పరిణామాలు ఒకదాని వెంట ఒకటి చోటు చేసుకుంటూ వచ్చాయి. లఢక్ లెప్టినెంట్ గవర్నర్ రాకేష్ కుమార్ మాథుర్.. కేంద్ర రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలతో సమావేశం అయ్యారు. ఆ మరుసటి రోజే భారత్, చైనా ఆర్మీ అధికారుల మధ్య మరో దఫా చర్చలు ప్రారంభం అయ్యాయి. రెండు రోజుల పాటు కొనసాగాయి. ఈ చర్చల ప్రక్రియ పెద్దగా ఫలించట్లేదంటూ అధికారులు భావిస్తున్నాయి.

  అదే సమయంలో ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె..లఢక్ పర్యటన చేపట్టారు. ప్రస్తుతం ఆయన లేహ్‌లో పర్యటిస్తున్నారు. సరిహద్దు భద్రతపై క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం న్యూఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లిన ఆయన నేరుగా లేహ్ బేస్ క్యాంపును చేరుకున్నారు. రెండురోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. పంగ్యాంగ్ లేక్ దక్షిణ ప్రాంతం వద్ద మెజారిటీ ప్రాంతాలను భారత్ తన అధీనంలోకి తెచ్చుకుంది.

  English summary
  Bharatiya Janata Party Rajya Sabha member Subramanian Swamy says that Moving of Russian built Sukhoi planes in large numbers by Chinese Airforce to Tibet border with India, is an indication that we have to get ready for retaliation.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X