బీజేపీ ఎంపీని చంపేస్తామని బెదిరింపులు

మైసూరు: మైసూరు-కొడగు నియోజక వర్గం ఎంపీ ప్రతాప్ సింహాను చంపేస్తాం అంటూ బూతులు తిడుతూ ఫేస్ బుక్ లో బెదిరించారు. ఎంపీ ప్రతాప్ సింహా (బీజేపీ) మైసూరు నగరంలోని విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మడికేరిలో మంగళవారం జరిగిన అల్లర్లలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుట్టప్ప మరణించిన విషయం తెలిసిందే. కుట్టప్ప ఫోటో, దాని పక్కన ఎంపీ ప్రతాప్ సింహా ఫోటోను ఫేస్ బుక్ లో పెట్టారు.

MP Pratap Simha field complaint to Mysuru City police.

కుట్టప్పకు పట్టిన గతే నీకు పడుతుందని త్వరలో నిన్నూ లేపేస్తాం అంటూ ప్రతాప్ సింహాను హెచ్చరించారు. ఓ ఫేస్ బుక్ ఖాతా నుంచి ఈ బెదిరింపులు వచ్చాయని ప్రతాప్ సింహా మీడియాకు చెప్పారు. కుట్టప్పకు ఏవిదంగా చావు వచ్చిందో అదే విదంగా నీకు చావు దగ్గర అవుతుందని బెదిరించారని ఆయన అన్నారు.

ఎంపీ ప్రతాప్ సింహా ఫిర్యాదు చేశారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మైసూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద్ మీడియాకు చెప్పారు. అయితే ఫేస్ బుక్ నకిలిదా లేకా ఎవరైనా కావాలనే చంపేస్తాం అని బెదిరించారా అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+