Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్ ఇంత వరకు మాజీ సీఎం కుమారస్వామి కోసం ప్రచారం చేయలేదు, మండ్యలో సుమలత అంబరీష్ ఎన్నికల ప్రచారం చెయ్యకపోవడంతో బీజేపీ నాయకులతో పాటు మాజీ సీఎం కుమారస్వామి హడలిపోతున్నారు.

ఇదే సమయంలో మైసూర్-కొడుగు లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి యదువీర్ వడయార్ కోసం సుమలత అంబరీష్ తీరికలేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. శనివారం మైసూరు లోక్‌సభ నియోజకవర్గంలో మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత యదువీర్ తరపున జోరుగా ప్రచారం చేశారు. యదువీర్ వడయార్ చాలా సాధారణ వ్యక్తి, మీ అందరికీ సేవ చేయడానికి వచ్చారని, అందు కోసం ఆయనను గెలిపించి లోక్ సభకు పంపాలని సుమలత అంబరీష్ మైసూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

MP Sumalatha Ambarish has not campaigned for the election so far people are getting upset

మైసూరులోని కేఆర్‌ నియోజకవర్గంలో జరిగిన నారీశక్తి సమావేశంలో సుమలతా అంబరీష్‌ మాట్లాడుతూ నేను మండ్యలో పోటీ చేసినప్పుడు తనకు మహిళలు నాకు అండగా నిలిచారని, తనకు మైసూరు మధ్య విడదీయరాని సంబంధం ఉందని, అంబరీష్ ఇక్కడే చదువుకుని పెరిగి పెద్దవాడు అయ్యాడని, మేం చాలా సినిమా షూటింగ్‌ల కోసం ఇక్కడికి వచ్చేవాళ్లమని, ఇలాంటి అందమైన, సాంస్కృతిక నగరం ఎలా ఏర్పడింది? అంటే అది మీమంచి తనం అని సుమలత అంబరీష్ అన్నారు.

మైసూరు స్వాతంత్య్రానికి పూర్వం అభివృద్ధి చెందిన నగరమని, ఆధునిక నగర నిర్మాణానికి మైసూర్ మహారాజులు చేసిన కృషి అపారమని సుమలత గుర్తు చేశారు. మోదీ తన స్వార్థం కోసం ఎప్పుడూ ఆలోచించలేదని, ప్రనిత్యం ప్రజల కోసం తపనపడే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని, ఆయన మన దేశ ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారని, మహిళలకు ఎన్నో పథకాలు అందించారని, ఉజ్వల్ యోజనతో పాటు ఎన్నో పథకాలు అందించి మహిళలు ఆత్మగౌరవంతో జీవించేలా చేయూతనిచ్చారని సుమలత అన్నారు.

మోదీ మరోసారి ప్రధాని కావాలంటే బీజేపీకి ఓటు వెయ్యాలని సుమలత అంబరీష్ మనవి చేశారు. అయితే మైసూరులో ఎన్నికల ప్రచారం చేస్తున్న సుమలత అంబరీష్ మండ్యలో ఎన్నికల ప్రచారం చెయ్యకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని జేడీఎస్ నాయకులు అంటున్నారు. బీజేపీ మీద ఒత్తిడి తీసుకువచ్చి సుమలతతో మండ్యలో ఎన్నికల ప్రచారం చేయించాలని మాజీ సీఎం కుమారస్వామి అనుకుంటున్నారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+