Black Fungus ఇక మహమ్మారి: ప్రకటించిన తొలి రాష్ట్రం అదే
జైపూర్: ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకుని బయటపడ్డ వారిని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో గండం వెంటాడుతోంది. భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ తరహా కేసులు దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోతోన్నాయి. బ్లాక్ ఫంగస్ కేసులు తొలిసారిగా వెలుగులోకి వచ్చిన మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకూ తీవ్రతరమౌతోంది. రాష్ట్ర ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తోంది. చాపకింద నీరులా ప్రమాదకరంగా విస్తరిస్తోండటం పట్ల అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
Recommended Video
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్.. ఇప్పటికే బ్లాక్ ఫంగస్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ ఫంగస్ నివారణకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేలా ఏర్పాటు చేసింది. తాజాగా- రాజస్థాన్ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్‌ను మహమ్మారిగా గుర్తించింది. కారణాలు తెలియట్లేదు గానీ- ఈ రాష్ట్రంలో ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ తీవ్రత అత్యధికంగా ఉంటోంది. వంద వరకు కేసులు నమోదయ్యాయి. మరే రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో బ్లాక్ ఫంగస్ కేసులు లేవు.

దీనితో అప్రమత్తమైన అశోక్ గెహ్లాట్ సర్కార్.. బ్లాక్ ఫంగస్‌ను మహమ్మారిగా ప్రకటించింది. దీన్ని మహమ్మారిగా గుర్తించిన తొలి రాష్ట్రం ఇదే. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సిింగ్ ఆసుపత్రిలో దీనికోసం ప్రత్యేకంగా ఓ వార్డును ఏర్పాటు చేసింది. ముకోర్‌మైకోసిస్ వార్డ్‌గా గుర్తించింది. దీని బారిన పడిన పేషెంట్లకు ప్రత్యేక చికిత్సను అందిస్తోంది. రాజస్థాన్ ఎపిడెమిక్ చట్టం-2020లో దీన్ని చేర్చింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి అఖిల్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్‌తో సమానంగా ఈ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications