భార్య కోసం.. ముఖేష్ అంబానీ కొత్త కేరాఫ్ అడ్రస్
ముంబై: దేశీయ పారిశ్రామికదిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ- దేశ ఆర్థిక రాజధానిలో మరో కేరాఫ్ అడ్రస్ ను సృష్టించారు. ముంబై బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో గల జియో వరల్డ్ సెంటర్ లో ప్రత్యేకంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ను నెలకొల్పారు. ఆయన భార్య నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఇవ్వాళ దీన్ని ప్రారంభించారు. ఈ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సెలెబ్రిటీలు తరలివచ్చారు.
శ్రీరామ నవమి పండగ సందర్భంగా నీతా అంబానీ ఒక రోజు ముందే ఈ కల్చరల్ సెంటర్ లో ప్రత్యేక పూజలు చేశారు. రామ నవమి వేడుకలను ఆమె అక్కడే నిర్వహించారు. ఇవ్వాళ ఈ సెంటర్ ను అధికారికంగా ప్రారంభించారు. దేశ కళారంగాన్ని, సాంస్కృతి వైభవాన్ని, సంప్రదాయ కళలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్ కు రూపకల్పన చేశారు. ఆమె అంచనాలు, ఆశయలకు తగ్గట్టుగా దీన్ని నిర్మించారు ముఖేష్ అంబానీ.

ఈ కల్చరల్ సెంటర్ సీట్ల సామర్థ్యం 2000. ఒకేసారి 2000 మంది ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించవచ్చు. నాలుగు అంతస్తుల్లో ఆర్ట్ హౌస్, పెవిలియన్, ఆర్ట్ షో, ఎగ్జిబిషన్‌లను ఇందులో ప్రదర్శించుకోవడానికి అనువైన హాళ్లను తీర్చిదిద్దారు. ఈ సెంటర్ విస్తీర్ణం 52,627 చదరపు అడుగులు. మ్యూజియం, స్టూడియో థియేటర్ కూడా ఉన్నాయి ఇందులో. ఈ ప్రాజెక్ట్ ను ఎందుకు చేపట్టడానికి గల కారణాలను నీతా అంబానీ వివరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ కల్చరల్ సెంటర్ ను చేపట్టడాన్ని తన అదృష్టంగా భావిస్తోన్నానని నీతా అంబానీ అన్నారు. సినిమా, సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్యం, జానపద కథలు, కళలు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దీన్ని నిర్మించామని వివరించారు. సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఇలాంటి ఓ సెంటర్ ను ప్రారంభించాలని తాను ఎప్పటి నుంచో భావిస్తూ వచ్చానని, అది ఇప్పటికి కార్చరూపాన్ని దాల్చిందని చెప్పారు.
కాగా- ఈ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఇషా అంబానీ, నిక్ జొనాస్, ప్రియాంక చోప్రా, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, విధూ వినోద్ చోప్రా, అనుపమ్ ఖేర్, షాహిద్ కపూర్, మిరా రాజ్‌పూత్, దియా మీర్జా.. వంటి దేశీయ పారిశ్రామి దిగ్గజాలు, బాలీవుడ్ సెలెబ్రెటీలు ఈ నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications